About Me

Over the last few decades I've spent a number of hours cooking for my family of 5. My husband is a retired bank Manager and my 3 boys are IIT graduates. Now I'm sharing my knowledge and thoughts to the world through this site. Whether you are a busy mom or a student learning to cook, you will find this blog helpful for cooking simple and easy to make food for yourself and the whole family. Hope you enjoy my recipe blog! I also love listening to devotional songs. Please browse through my devotional blogs to know more about them. I am always looking for ways to improve my blogs. Please leave your comments. If you like to see recipe of any particular dish or lyrics of a devotional song, please also let me know. Thanks for reading my blog.

Monday, 3 October 2011

శ్రీ ఆంజనేయ దండకమ్ (Sri Anjaneya Dandakam)

శ్రీ ఆంజనేయం – ప్రసన్నాంజనేయం – ప్రభాదివ్యకాయం – ప్రకీర్తిప్రదాయం – భజేవాయుపుత్రం – భజేవాలగాత్రం – భజేహం పవిత్రం – భజేసూర్యమిత్రం – భజేరుద్రరూపం – భజే బ్రహ్మతేజంబటంచున్ – ప్రభాతంబు సాయంత్రంబు – నీనామ సంకీర్తనల్ జేసి – నీరూపు వర్ణించి – నీమీద నేదండకం బొక్కటిన్ – జేయనూహించి – నీమూర్తినిన్ గాంచి – నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై – శ్రీరామ భక్తుండనై – నిన్ను నేగొల్చెదన్ – నీకటాక్షంబునన్ జూచితే – వేడుకల్ జేసితే – నా మొరాలించితే – నన్ను రక్షించితే- దగ్గరన్నిల్చితే – తొల్లి సుగ్రీవుకు న్మంత్రివై స్వామికార్యార్ధమం దుండి – శ్రీరామసౌమిత్రులంజూచి – వారిన్ విచారించి – సర్వేశు పూజించి – యబ్బానుజుల బంటుగావించి – యవ్వాలినింజంపి – కాకుత్థ్సతిలకున్ – దయాదృష్టి వీక్షించి – కిష్కింధకేతెంచి – శ్రీరాముకార్యార్ధమై – లంకకేతెంచియున్ – లంకిణింజంపియున్ – లంకయున్గాల్చియున్ – భూమిజన్ జూచి – యానందముప్పొంగ – నా యుంగరంబిచ్చి – యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి – సంతోషితున్ జేసి – సుగ్రీవుడా యంగదా జాంబవంతాది – వీరాదులం గూడి – యాసేతువున్ దాటి – వానరుల్ మూక పెన్మూకలై – దైత్యులన్ ద్రుంచగా – రావణుండంత – కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి – యాశక్తియున్ వేసి – యాలక్ష్మణున్ మూర్చనొందించగా – నప్పుడేబోయి సంజీవియున్ దెచ్చి – సౌమిత్రికిన్నిచ్చి – ప్రాణంబురక్షించగా – కుంభకర్ణాది న్వీరులన్ బోరి – శ్రీరాము బాణాగ్ని వారందరున్ – రావణున్ జంపగా- నంతలోకంబులానందమైయుండ – నవ్వేళలందు – న్విభీషణన్ – వేడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జేయించి సీతామహాదేవినిన్ దెచ్చి – శ్రీరాముతో జేర్చి – యయోధ్యక్షున్ వచ్చి – పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న – నాకేవ్వరున్ కూర్మిలేరంచు – మన్నించినన్ – శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను – నీనామ సంకీర్తనల్ జేసితే – పాపముల్ బాయునే – భయములు నీర్దునే – భాగ్యముల్ గల్గునే – సకల సామ్రాజ్యముల్ – సకల సంపత్కారమ్ముల్ధగం గల్గవే వానరాకార – యోభక్తమందార – యోపుణ్యసంచార – యోధీర – యోవీర – నీవేసమస్తంబు – నీవేమహాఫలముగా వెలసి – యా తారకబ్రహ్మమంత్రంబు – పఠియించుచున్ సంధానమున్ జేయుచున్ స్థిరముగా వజ్రదేహంబునుందాల్చి – శ్రీరామ శ్రీరామ యంచున్ – మనఃపూతమై – ఎప్పుడున్ తప్పకన్ దలతు – నాజిహ్వాయందుండియుం నీదీర్ఘదేహంబు – త్రైలోకసంచారివై – రామనామాంకితధ్యానివై – బ్రహ్మవై – బ్రహ్మతేజంబునన్ – రౌద్రనిజ్వాల కల్లోల – హావీర హనుమంత – ఓంకార ఓంకార శబ్దంబులన్ – క్రూరసర్వగ్రహ భూతప్రేతపిశాచ – శాకినీడాకీనీ – మోహినీ గాలిదయ్యంబులన్ నీదువాలంబునన్ జుట్టి - నేలం బడంగొట్టి – నీ ముష్టిఘాతంబులన్ – బహుదండంబులన్ – రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్నిరుద్రుండవై – బ్రహ్మప్రభాభాపితంబైవ – నీదివ్య తేజంబునన్ జూపి రార నాముద్దు కుమారా యంచు దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే, సదా బ్రహ్మచారీ నమస్తే, వ్రతపూర్ణహారీ నమస్తే వాయుపుత్రా నమస్తే నమోనమః నీదివ్యక్షేత్రంబునైమొప్పు శ్రీతాడుబందుపురంబందు – (ఇచటతాము పూజించు హనుమాన్ నామమును ఉచ్చరించుకోవచ్చును) నీనోర్మిదర్శించి హర్షించు – నీభక్తబృందంబులన్ జేరి – దయాదృష్టివీక్షించి – ఎల్లప్పుడున్ దీవించు స్వామి నమస్తే నమస్తే – నమస్తే వ్రతః పూర్ణకారీ నమస్తే – శ్రీమద్విరాంజనేయానమస్తే – నమస్తే నమః!!
(ఈ దండకాన్ని నిష్టతో పఠించినట్లయితే, సర్వపాపాలూ నశిస్తాయి.
బాధలు, భయాలు, అనారోగ్యాలూ ఉండవు. భోగభాగ్యాలు వరిస్తాయి.
సకల సంపదలూ కల్గుతాయి. భూతప్రేత పిశాచ రోగ శాకినీ డాకీనీ గాలిదయ్యంబులు దరికి చేరవు)

No comments:

Post a Comment