దేవీ శరన్నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారి స్వరూపం బాల త్రిపుర సుందరి. ఈ త్రిగుణైక శక్తి , ఆనందప్రదాయిని మాత అవతారిక, పూజావిధానం గురీంచి వివరాలు....
దేవీ శరన్నవరాత్రులలో రెండవ రోజు శక్తి అవతారిక "గాయత్రి దేవి". సకల వేద స్వరూపిణి, మంత్రాలకు మూల శక్తి, అనంత మంత్రశక్తి ప్రదాత మాత అవతారిక, పూజావిధానం గురీంచి వివరాలు....
దేవీ శరన్నవరాత్రులలో మూడవ రోజు శక్తి అవతారిక మహాలక్ష్మి - సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. క్షీరాబ్ది పుత్రిక. డోలాసురమర్ధిని. అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి
దేవీ శరన్నవరాత్రులలో నాల్గవ రోజు అమ్మవారి అలంకారం అన్నపూర్ణ. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు - మాత అవతారిక, పూజావిధానం గురీంచి వివరాలు....
దేవీ శరన్నవరాత్రులలో ఐదవ రోజు శక్తి అవతారిక - త్రిగుణాతీతమైన కామేశ్వరీ స్వరూపం లలితాత్రిపుర సుందరి. ఆమె ఆనందహేల. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి.
దేవీ శరన్నవరాత్రులలో ఆరవ రోజు శక్తి అవతారిక - బ్రహ్మ చైతన్య స్వరూపిణి సరస్వతీదేవి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతోభక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది
దేవీ శరన్నవరాత్రులలో అష్టమినాటి శక్తి అవతారిక - దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి దుర్గాదేవి. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.
దేవీ శరన్నవరాత్రులలో నవమినాటి అమ్మవారి అతి ఉగ్రమైన రూపం మహిషాసురమర్ధిని. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించి, అమ్మ సకల దేవతల అంశలతో మహా శక్తిగాఈ రోజు దర్శనం ఇస్తుంది.
దసరా సంబరాలలో చివరి రోజు అమ్మ రాజరాజేశ్వరీ అవతారం - విజయ దశిమి. పండుగ సంబరాలు, కొత్తబట్టలు, పిండి వంటలు, శ్రీచక్రపూజ, శమీపూజ, రామలీలలు - ఒకటేమిటి దశిమి సంబరాలు ఎన్నెన్నో!! ఈ విజయదశిమి సంపుటి పాఠకులకు విజయాన్ని చేకూర్చాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ.....
No comments:
Post a Comment