About Me

Over the last few decades I've spent a number of hours cooking for my family of 5. My husband is a retired bank Manager and my 3 boys are IIT graduates. Now I'm sharing my knowledge and thoughts to the world through this site. Whether you are a busy mom or a student learning to cook, you will find this blog helpful for cooking simple and easy to make food for yourself and the whole family. Hope you enjoy my recipe blog! I also love listening to devotional songs. Please browse through my devotional blogs to know more about them. I am always looking for ways to improve my blogs. Please leave your comments. If you like to see recipe of any particular dish or lyrics of a devotional song, please also let me know. Thanks for reading my blog.

Wednesday 30 November 2011

శ్రీ వేంకటేశ్వర గోవింద నా మావళి

శ్రీనివాస      గోవిందా                     శ్రీ వేంకటేశ       గోవిందా
భక్తవత్సల   గోవిందా                     భాగవతప్రియ   గోవిందా
                     
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
నిత్యనిర్మల   గోవిందా                    నీలమేఘ         గోవిందా
పురాణపురుష  గోవిందా               పుండరీకాక్ష      గోవిందా
                    
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
నందనందన     గోవిందా                 నవనీతచోర       గోవిందా
పశుగణపాలక  గోవిందా                 పాపవిమోచన   గోవిందా
                     
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
దుష్టసంహారణ  గోవిందా               దురితనివారణ     గోవిందా
శిష్టపరిపాలక    గోవిందా               కష్టనివారణ          గోవిందా
                     
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!

వజ్రమకుటధర  గోవిందా            వరాహమూర్తి          గోవిందా  
గోపీజనలోల      గోవిందా            గోవర్ధనోద్దార            గోవిందా
                      
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
దశరధనందన    గోవిందా             దశముఖమర్దన     గోవిందా
పక్షివాహన        గోవిందా             పాండవ ప్రియ         గోవిందా
                      
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
మత్స్యకూర్మహారి  గోవిందా              మధుసూదనహరి  గోవిందా  
వరాహనరసింహ   గోవిందా              వామనభ్రుగురామ గోవిందా
                      
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!  
బలరామానుజ      గోవిందా              బౌద్ధకల్కి              గోవిందా
వేణుగానప్రియ      గోవిందా              వేంకటరమణ         గోవిందా
                     
 గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !! 
సీతానాయక        గోవిందా               శ్రితజనపాలక        గోవిందా
దరిద్రజనపోషక    గోవిందా               ధర్మసంస్థాపక       గోవిందా 
                      
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
అనాధరక్షక         గోవిందా               ఆపద్బాంధవ        గోవిందా
శరణాగతవత్సల  గోవిందా               కరుణాసాగర         గోవిందా 
                      
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
కమలదళాక్ష      గోవిందా                కామితఫలదా       గోవిందా
పాపనాశక         గోవిందా                పాహి మురారే       గోవిందా     
                      
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!             
 శ్రీముద్రాంకిత    గోవిందా                శ్రీవత్సాంకిత          గోవిందా                                        
ధరణీనాయక     గోవిందా                దినకరతేజా           గోవిందా
                      
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
పద్మావతీప్రియ  గోవిందా                 ప్రసన్నమూర్తీ       గోవిందా
అభయహస్త ప్రదర్శన గోవిందా         మర్త్యావతార         గోవిందా  
                      
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!      
శంఖచక్రధర             గోవిందా          సారంగ గదాధర    గోవిందా   
విరజాతీర్ధ                గోవిందా           విరోధిమర్దన         గోవిందా
                      
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!                 
సాలగ్రామధర          గోవిందా            సహస్రనామా      గోవిందా        
లక్ష్మీవల్లభ              గోవిందా            లక్ష్మణాగ్రజ         గోవిందా                      

                      గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
కస్తూరితిలక            గోవిందా            కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన   గోవిందా                   గజరాజరక్షక        గోవిందా
                      
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
వానరసేవిత            గోవిందా            వారధిబంధన        గోవిందా
ఏడుకొండలవాడా    గోవిందా            ఏకస్వరూపా         గోవిందా
                    
 గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
శ్రీరామకృ ష్ణా          గోవిందా             రఘుకులనందన   గోవిందా
ప్రత్యక్షదేవా            గోవిందా             పరమదయాకర     గోవిందా
                     
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
వజ్రకవచధర          గోవిందా             వైజయంతిమాల    గోవిందా
వడ్డీకాసులవాడ     గోవిందా             వసుదేవతనయా   గోవిందా                     

                     గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
బిల్వపత్రార్చిత      గోవిందా              బిక్షుకసoస్తుత      గోవిందా
స్త్రీపుంరూప           గోవిందా              శివకేశవమూర్తి      గోవిందా                      

                     గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
బ్రహ్మాండరూపా      గోవిందా              భక్తరక్షక               గోవిందా
నిత్యకళ్యాణ           గోవిoదా              నీరజనాభ             గోవిందా
                      
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!       
హతీరామప్రియ      గోవిందా              హరిసర్వోత్తమ       గోవిందా             
జనార్ధనమూర్తీ       గోవిందా              జగత్సాక్షిరూప       గోవిందా         
                     
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!   
అభిషేక ప్రియ        గోవిందా               ఆపన్నివారణ        గోవిందా 
రత్నకిరీటా           గోవిందా                రామానుజనుత    గోవిందా      
                     
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!           
స్వయంప్రకాశ       గోవిందా                ఆశ్రితపక్ష             గోవిందా                     
నిత్యరక్షక             గోవిందా                నిఖిలలోకేశా        గోవిందా      
                     
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
ఆనందరూప        గోవిందా                 అద్యంతరహితా     గోవిందా  
ఇహపరదాయక   గోవిందా                 ఇభరాజరక్షక        గోవిందా
                     
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
పరమదయాళో   గోవిందా                  పద్మనాభహరి       గోవిందా         
తిరుమలనివాసా గోవిందా                 తులసీవనమాల    గోవిందా     
                     
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
శేషాద్రినిలయ     గోవిందా                  శేషశాయినే           గోవిందా    
శ్రీనివాస             గోవిందా                   శ్రీవెoకటేశ            గోవిందా 
                     
గోవిoదా హారి గోవిoదా ! గోకులనoదన గోవిoదా !!
!! ఇతి శ్రీ వెoకటేశ్వర గోవిoదనామావళి !!
           
   
           
   
    
         
             
  
        
           
         
                  

Tuesday 29 November 2011

శ్రీ పార్వత్యష్టోతర శతనామావళి:


పార్వతీ అష్టోత్తరము

(ప్రతీ నామానికి ము0దుగ ఓ0, చివరిని నమ: కలిపి చదవ వలెను)

ఓం  పా ర్వత్యై  నమః                        
మహాదేవ్యై,
జగన్మాత్రే
సరస్వ త్యై
చoడికాయై,
లోకజనన్యై,
సర్వదేవాధి దేవతాయై
గౌర్యై/పరమాయై
ఈశాయై
నగే0ద్రతనయాయై
సత్యై
బ్రహ్మచారిణ్యై
శర్వాణ్యై
దేవమాత్రే,
త్రిలోచన్యై
బ్రహ్మణ్యై
వైష్ణవ్యై
రౌద్ర్యై
కాళరాత్ర్యై
తపస్విన్యై
శివదూత్యై
విశా లాక్ష్యై
చాము0డాయై
విష్ణుసోదర్యై
చిత్కళాయై
చిన్మయాకారాయై
మహిశాసురమర్దిన్యై
కాత్యాయనై
కాలరూపాయై
గిరిజాయై
మేనకాత్మజాయై
భవాన్యై
మాతృకాయై
శ్రీమాత్రే,
మహగౌర్యై
రమాయై
రామాయై
శుచిస్మితాయై
బ్రహ్మస్వరూపిణ్యై
రాజ్యలక్ష్మ్యై
శివప్రియాయై
నారాయణ్యై
మహాశక్యై
నవొఢాయై
భాగ్యదాయిన్యై
అన్నపూర్ణాయై
సదానoదాయై 
యౌవనాయై
మోహిన్యై
అఙ్ణానశుద్ధ్యై
ఙ్ణానగమ్యాయై
నిత్యాయై
నిత్యస్వరూపిణ్యై
కమలాయై
కమలాకారాయై
రక్తవర్ణాయై
క ళానిధయే
మధుప్రియాయై
కళ్యాణ్యై
కరుణాయై
జనస్థానాయై
వీరపత్న్యై
విరూపాక్ష్యై
వీరారాధితాయై
హేమాభాసాయై
సృష్టిరూపాయై
సృష్ఠిసoహార కారిణ్యై
రoజనాయై
యౌవనాకారాయై
పరమేశప్రియాయై
పరాయై/పుష్పిణ్యై
పుష్పాకారాయై
పురుషార్ధప్రదాయిన్యై
మహారూపాయై
మహారౌద్ర్యై
కామాక్ష్యై/వాగ్దేవ్యై
వరదాయై
భయనాశిన్యై/వాగ్దేవ్యై
వచన్యై/వారాహ్యై
విశ్వతోషిణ్యై
వర్ధనీయాయై
విశాలా క్ష్యై
కులసoపత్రదాయిన్యై
అర్ధదుఖ:చ్ఛేదదక్షాయై
అoబాయై
నిఖిలయోగిన్యై
సదాపురస్థాయిన్యై
తరోర్మూలతల0గతాయై
హరవాహసమాయుక్తాయై
మోక్షపరాయణాయై
ధరాధరభవాయై
ముక్తాయై
వరమ0త్రాయై
కరప్రదాయై
కళ్యాణ్యై
వాగ్భవ్వాయై
దేవ్యై/క్లీo కారిణ్యై
సoవిదే
ఈశ్వర్యై
హ్రీoకారబీజాయై
శాoభవ్యై
ప్రణవాత్మికాయై
మహాగౌర్యై
శుభప్రదాయై  

Parvathi astotram,

parvathyai namaH
mahaadhaevyai
jaganmaathyai
sarasva thyai
cha0dikaayai
loakajananyai
sarvadhaevaaDhi dhaevathaayai
gouryai
paramaayai
ఈశానాయై           (1౦)
nagae0dhrathanayaayai
sathyai
brahmachaariNyai
sharvaaNyai
dhevamaathrae
thiloachanyai
brahmaNyai
vaiShNvavyai
raudhrayai
kalaraathryai               (20)
thapasvinyai
sivadhoothyai
visHalaakShyai
chaamu0daaya
viShNusoadharyai
chithkalaayai
chinmaraakaraayai
mahiShasuramardhinyai
kathyayanai
kalaroopaayai                    (30)
girijaayai
maenakaathmajaayai
Bhavaanyai
maathtRkaayai 
shreemaathrae
mahagauryai
ramaayai
raamaayai
shuchismithaayai
 brahmasvaroopiNyai         (40)
 rajyalakShmai
shivapriyayai
naaraayaNyai
mahaashakyai
navoDaayai
Bhaagyadhaayinai
annapoorNaayai
sadana0dhaai
yauvanaayai
mohanyai                           (50)
aGNAnashudhDhyai
GnYaanashudhDhyai
GNaanagamyaayai
nithyaayai
nithyasvaroopiNyai
kamalaayai
kamalaakaaraayai
rakthavarNaayai
kalaniDhayai
maDhupriyayai
kaLyaaNai                        (60)
karuNaayai
janasThaanaaya
veerapathnai
viroopaakShyai
veeraaraaDhithaayai
haemaBhaasayai
SstRhstiroopaayai

stRShTisa0haarakariNyai
raojanaayai
yauvanaakaaraayai             (70)
paramaeshapriyaayai
paraayai
puShpiNyai
puShpaakaaraayai
puruShaarDhapradhaayinyai
mahaaroopayai
mahaaraudhryai
kaamaakShyai
varagdhaevyai                  (80)
varadhaayai
Bhavanaashinyai
vaagdhaevyai
vachanyai
vaaraahyai
visvathoaShinyai
varDhaneeyaayai
vishaalaakShai
kulasa0pathradhaayanai
arDhadhuKha:chChaeDhadhakShaayai
a0baayai                      (90)
niKhilayoaginyai
sadhaapurasthaayinyai
tharoarmoolathala0gathaayai
haravaahasamaayukthaayai
moakShaparaayaNaayai
DharaaDharaBhavaayai
mukthaayai
varama0thraayai
karapradhaayai
kaLyaaNyai
vaagBhavvaayai                      (100)
dhaevyai
klee0klaariNyai
sa0vidhae
eeshvaryai
hree0kaarabeejaayai
shaa0Bhavyai
praNavaathmikaayai
mahaagauryai
shuBhapradhaayai                ( 108 )                       



       

Wednesday 23 November 2011

తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు,మూడు గoటలు, విమాన వేంకటేశ్వర స్వామి

తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు,

తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు వరుసగా - భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు. ఏయే రూపాల ప్రాధాన్యత ఏమిటో  
మూలమూర్తి (ధ్రువబేరం) 
నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ''వీరస్థానక'' పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.
భోగ శ్రీనివాసమూర్తి (కౌతుక బేరం) 
ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాస మూర్తికి జరిపిస్తారు. ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్నిక్రీస్తుశకం 614లో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాల్లో ఆధారాలు లభించాయి. మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.
ఉగ్ర శ్రీనివాసమూర్తి (స్నపన బేరం)
ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. అప్పటినుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు. ఆవిధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటినుంచి ఉగ్ర శ్రీనివాస మూర్తిని సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపుకు తీసుకెళ్ళి, తిరిగి అంతరాలయానికి తీసుకొస్తారు.
శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి (ఉత్సవబేరం)
13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసికెళ్ళడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు.
కొలువు శ్రీనివాసమూర్తి (బలిబేరం)
గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూలవిరాట్టుకు తోమాలసేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు. తిరుమలలో ఆవేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏమైనా ఉంటే వాటి వివరాలను తెలియజేస్తారు. శ్రీవారి హుండీలో గతరోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ, వ్యయాలను తెలియజేస్తారు.

మూడు గoటలు
తిరుమలలో మొదటి గంట, నైవేద్యం
 సుప్రభాతసేవ, అభిషేకాలు, కొలువు, సహస్రనామార్చనల తర్వాత శయన మంటపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూస్తారు. తిరుమామణి మంటపంలో రెండుసార్లు గంటలు మోగిస్తారు. ఇలా తిరుమామణి మంటపంలో గంటలు మోగగానే అర్చకులు స్వామివారికి తొలి నైవేద్యం సమర్పిస్తున్నట్లు ప్రకటిస్తారు. జీయంగారు లేదా ఆయన సహాయకుడు వైష్ణవ సంప్రదాయంలోని ప్రబంధ అధ్యాయాలను పఠిస్తారు. దీన్ని సట్టుమురా అంటారు. వేంకటేశ్వరుని ముందు మెట్టుకు ఇవతలి నుండి నైవేద్యం పెడతారు. స్వామివారికి నైవేద్యంగా పులిహోర, దద్దోజనం, లడ్డూలు, వడలు, పొంగలి, చక్రపొంగలి, అప్పాలు, పోళీలు నివేదిస్తారు.
నైవేద్యం స్వామివారికే కాకుండా విష్వక్సేనుడు, గరుడుడు, నిత్యాసురులకు కూడా నివేదిస్తారు. ఇలా గంటలు మోగించి, నైవేద్యం సమర్పించడాన్ని వ్యవహారంలో మొదటి గంట లేదా ఆలయ మొదటి గంట అంటారు. 

తిరుమలలో రెండో గంట, అర్చన  
తిరుమలేశుని దేవాలయంలో అష్టోత్తర శతనామార్చన తర్వాత రెండో గంట మోగిస్తారు. ఈ సంప్రదాయాన్ని రెండో గంట లేదా అపరాహ్న పూజ ( Second Bell or Aparahna Pooja) అంటారు. ఇలా రెండో గంట మోగించినప్పుడు స్వామివారికి రెండోసారి నైవేద్యం సమర్పిస్తారు. రెండోసారి జరిగే ఈ అర్చనలో ''వరాహపురాణం'' లోని శ్రీ వేంకటేశ్వరుని నామావళిని జపిస్తారు. పోటు నుండి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆనక తాంబూలం సమర్పించి, కర్పూరహారతి ఇస్తారు.
తిరుమల వేంకటేశ్వర ఆలయంలో రెండో గంట మోగినప్పుడు చేసే అష్టోత్తర నామార్చనను చూసేందుకు భక్తులను అనుమతించరు. ఇది ఏకాంత సేవ. ప్రత్యేక సేవలకోసం టికెట్లు కొనుక్కున్న భక్తులు నివేదించిన ''చెరుపులు'' (పులిహోర, దద్దోజనం), ''పన్యారాలు'' (లడ్డూలు) మొదలైన నైవేద్యాలను తిరుమల వేంకటేశ్వరునికి సమర్పిస్తారు. భక్తులు తెచ్చిన దాంట్లో నుండి కొంత మాత్రమే వేంకటేశ్వరునికి సమర్పించి, తక్కిన పదార్ధాలను వారికి తిరిగి ఇచ్చేస్తారు.
తిరుమలలో మూడో గంట
తిరుమల వేంకటేశ్వర ఆలయంలో ఉదయం జరిపే తోమాలసేవ, రాత్రిపూట కూడా జరుపుతారు. ఆ సేవ అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి అష్టోత్తర శతనామార్చన చేస్తారు. శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీ నామార్చన జరుపుతారు. ఆ సమయంలో మూడో గంట మోగిస్తారు. అప్పుడు నైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం సర్వదర్శనం తిరిగి ప్రారంభమౌతుంది. 
తిరుమల విమాన వేంకటేశ్వర స్వామి 
పూర్వం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయ అర్చకులు తొమ్మిదిమంది , స్వామివారి ఆభరణాలను ధరించారు. అది స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగర రాజు కంటపడింది. దాంతో ఆ రాజుకు ఆగ్రహం ముంచుకొచ్చింది. తొమ్మిదిమంది అర్చకులనూ విచక్షణా రహితంగా అక్కడికక్కడే చంపేశాడు.

నరహత్య మహాపాపం అనుకుంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిదిమందిని హత్య చేశాడు రాజు. పైగా పవిత్ర దేవాలయంలో హత్య చేశాడు. అది సామాన్య దోషం కాదు. మహా పాపం. ఆ పాప పరిహారం కోసం వ్యాసరాయలు ప్రయత్నించారు. పన్నెండేళ్ళ పాటు భక్తులెవర్నీ ఆలయంలోనికి అనుమతించలేదు. వ్యాసరాయలవారు గర్భగుడిలో ప్రవేశించి, పాప నివృత్తి అయ్యేందుకు కఠోర దీక్షతో పూజలు నిర్వహించారట.

ఆ పన్నెండేళ్ళ కాలంలో భక్తులకు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును దర్శించుకునే భాగ్యం కలగలేదు కానీ, అందుకు ప్రతిగా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇలా ప్రతిష్టించిన వేంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉత్తర వాయువ్యంలో ఉంటుంది. అప్పుడు ప్రతిష్టించిన స్వామివారి విగ్రహమే విమాన వేంకటేశ్వర స్వామి. అప్పుడు స్వామివారికి బదులుగా ప్రతిష్టించిన విమాన వేంకటేశ్వర స్వామిని ఇప్పటికీ భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. తిరుమల వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆచారంగా మారింది.

ప్రస్తుతం ఆనంద నిలయానికి ఉత్తర వాయువ్యంలో విమాన వేంకటేశ్వరుని విగ్రహం వద్ద బంగారు, వెండి పూత పూసి, మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. తిరుమల దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా విమాన వేంకటేశ్వరుని దర్శించుకుంటారు.



Friday 18 November 2011

Shree Rama Dandakam

http://www.4shared.com/account/dir/_KnMQHJy/_online.html?rnd=20#dir=140539655Shree Rama Dandakam

shree bhaktha hruththaapa gaaDaanDhakaaraa yuthaarka |
prabhaakaara dhivyambau naethrothsavam baunu
nee roopu joopimpa raamapraBhoa |
nee vanae kaanda koatlan viDheendhraadhi dhaevaasura sToola sookShambulan |
neevu puttinchi kaapaadi naShtambu saeyan |
sadhaa moodu roopambulan dhaalchi lokaeshudai, viShNuvai, rudhrudai |
chaalaleelaa vinoadhambulan saeya |
marthyun sadhaa |
ShaNmathambaina roopambulo buttu |
kaamaadhi Shadvarga kruthyambulan salpi |
garvaa chalaa rooDulai mooDulai |
chaala dhaaraarKha gaakaara goabamDhu loakambulan joochuchupponguchun |
kuKShi poorNambu saeyanga laekeppudan |
dhu:Khavaaraashiloa mugnulauvvaaru |
shreeraamunin jaeru |
naaraaja maargambulan |
svapna mandhaina saaDhimpa laerayya |
nae namminaanayya raavayya |
naa yokka Bhaagyambu nee vanuchu yunnaanu |
shree thyaagaraajaarchithaa |
aKhanda laadhyaShta dhikpaala samsaevya
maampaahi, maampaahi, maampahi, maampaahi .......
        
this dandakam  is from prahlada bhakta vijayam by shree Thyagaraja


శ్రీ రామ ద0డకమ
. శ్రీ భక్త హ్రుత్తాప గాఢా0ధకారా యుతార్క |
ప్రభాకార దివ్య0బౌ నేత్రో త్సవ0 బౌను |
   నీ రూపు జూపి0ప రామప్రభో |
నీ వనే కా0డ కోట్లన్ విధీ0ద్రాది దేవాసుర స్ఠూల సూక్ష0బులన్ |
నీవు పుట్టి0చి కాపాడి నష్ట0బు సేయన్ |
సదా మూడు రూప0బులన్ దాల్చి లొకేశుడై, విష్ణువై, రుద్రుడై |
చాలలీలా వినోద0బులన్ సేయ |
మర్త్యున్ సదా షణ్మత0బైన రూప0బులొ బుట్టు |
కామాది షడ్వర్గ క్రుత్య0బులన్ సల్పి |
గర్వా చలా రూఢులై, మూఢులై  |
చాల దారార్ఖ గాకార గోబ0ధు లోక0బులన్ జూచుచుప్పొ0గుచున్ |
కుక్షి పూర్ణ0బు సేయ0గ లేకెప్పుడన్ |
దు:ఖవారాశిలో ముగ్నులౌవ్వారు |
శ్రీరాముని0జేరు |
నారాజ మార్గ0బులన్ |
స్వప్న మ0దైన సాధి0ప లేరయ్య |
నే నమ్మినానయ్య రావయ్య |
నా యొక్క భాగ్య0బు నీ వనుచు యున్నాను |
శ్రీ త్యాగరాజార్చితా |
అఖ0డ లాద్యష్ట దిక్పాల స0సేవ్య
మా0పాహి, మా0పాహి, మా0పహి,మా0పాహి............           

 ఈ ద0డకము  శ్రీ త్యాగరజ విరచిత " ప్రహ్లాద భక్త విజయ0 లోనిది"

http://www.4shared.com/account/dir/_KnMQHJy/_online.html?rnd=20#dir=140539655   


Wednesday 9 November 2011

Visited temples in and around Vizag




Small lingas arranged in a linga shape












Lingala thirugugu


Devipuram

Devipuram

Devipuram

Devipuram

Devipuram

Devipuram



Sree Chakra Description



10000 L:ingas at Devipuram
Siva Linga made with sahasra (1000) lingas ( Panchadharalu)

A stream at Panchadaralu

 stream at Panchadaralu

Two face Vinayaka either side( back  side)
at panchadharalu 

Two face Vinayaka either side( Front side)
at panchadharalu

Wednesday 2 November 2011

( MS Rama Rao ) సు0దరకా0డ (one part of the epic Ramayana) Telugu lyrics

http://www.4shared.com/mp3/muXuF7AN/Track_1.html
http://www.4shared.com/mp3/CEk86VeU/Track_2.htm

                                                       సు0దరకా0డ

శ్రీ హను మాను గురుదేవులు నాయెద
పలికిన సీతా  రామకథ
నే పలికెద సీతా రామకధ

(వరుస క్రమముగా చదవవలేను)
సి0ధుభైరవి
1) శ్రీ హనుమ0తుడు అ0జనీసుతుడు    అతి బలవ0తుడు రామభక్తుడు
ల0కకు పోయి రాగల ధీరుడు              మహిమోపేతుడు శత్రు కర్మనుడు
జా0బవదాది వీరు ల0దరును              ప్రేరెపి0పగ సమ్మతి0చెను
ల౦కేశ్వరుడు అపహరి0చిన                జానకి మాత జాడ తెలిసికొన
2) తన త0డ్రి యైన వాయుదేవునకు       సూర్య చ0ద్ర బ్రహ్మాది దేవులకు
వానరే0ద్రుడు మహే0ద్రగిరిపై               వ0దనములిడె పూర్వాభి ముఖుడై
రామనామమున పరవశుడయ్యె         రోమ రోమమున పులికితుడయ్యె
కాయము పె0చె కుప్పి0చి ఎగసె          దక్షిణ దిశగా ల0క చేరగ
3) పవన తనయుని పదఘట్టనకె          పర్వత రాజము గడగడ వణకె
ఫలపుష్పాదులు జలజల  రాలె          పరిమళాలు గిరి శిఖరాలు  ని0డె
పగిలిన శిలల  దాతువు లెగసె            రత్నకాంతులు  నలుదిశల మెరసె
గుహలను దాగిన భూతములదిరి        ధీనారవముల పరుగిడె బెదిరి.         
                                                                                             ( శ్రీ హనుమాను )                        
దర్బారుకానడ
4)  రఘుకులోత్తముని రామచ0ద్రుని,       పురుషోత్తముని పావనచరితుని
 నమ్మిన బ0టుని అనిలాత్మజుని              శ్రీ హనుమ0తుని స్వాగతమిమ్మని
నీ కడకొ0త విశ్రా0తి దీసికొని                   పూజల0దుకొని పోవచ్చునని
సకల ప్రవర్ధితుడు సాగరుడె0తొ                ముదమున పలికె మైనాకునితో
5)  మైనాకుడు ఉన్నతుడై నిలచె              హనుమ0తుడు ఆగ్రహమునగా0చె
ఇది  ఒక విఘ్నము కాబోలునని              వారధి పడద్రోసె ఉరముచే గిరిని
పర్వత శ్రేష్టుడా పోటున క్రు0గె                   పవనతనయుని  బలముగని పొ0గె
తిరిగి నిలిచె హనుమ0తుని పిలిచె             తన శిఖరముపై నరుని రూపమై        
                                                                                            ( శ్రీ హనుమాను )
      శ్రీ ర0జని
6)  వానరోత్తమా ఒక సారి నిలుమా             నాశిఖరాల శ్రమ తీర్చుకొనుమా 
క0దమూలములు ఫలములు తినుమా      నా పూజలుగొని మన్ననల0దుమ
శతయోజనముల పరిమితము గల             జలనిదినవలీల దాటిపోగల
 నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు                 నీదు త0డ్రి కడు పూజ్యుడు నాకు
       
7) పర్వతోత్తముని కరమున నిమిరి               పవనతనయుడు పలికెను ప్రీతిని
ఓ గిరీ0ద్రమా స0తసి0చితిని                         నీ సత్కారము ప్రీతిన0దితిని
రామకార్యమై ఎఏగు చు0టిని                        సాధి0చువరకు ఆగన౦టిని
నే పోవలె క్షణమె0తో విలువలె                       నీ దీవెనలె నాకు బలములె              
                                                                                   ( శ్రీ హనుమాను ) 
  మా0డు

8)  అనాయాసముగ అ0బరవీధిని                  పయనము జేసెడు పవనకుమారుని
ఇ0ద్రాదులు మహర్షులు  సిధ్దులు                  పులకా0కితులై ప్రస్తుతి0చిరి
రామకార్యమతి సాహసమ్మని                        రాక్షస బలమతి భయ0కరమని
కపివరుడె0తటి ఘన తరుడోయని,                 పరిశీలనగా ప0పిరి సురసను

9) ఎపుడో నన్ను నిన్ను మ్రి0గమని               వరమొసగి మరీ బ్రహ్మ ప0పెనని
అతిగా  సురస నోటిని దెరచె                            హనుమ౦తు అలిగి కాయము పె౦చె
ఒకరినొకరు మి౦చి కాయము పె౦చిరి             శతయోజనములు విస్తరి0చిరి          
పై ను0డి సురలు తహతహలాడిరి                  ఇరువురిలో ఎవ్వరిదో గెలుపనిరి

10)సురస ముఖము విశాల మౌటగని            సూక్ష్మ బుద్దిగొని సమయమినదేనని,
క్షణములోన అ0గుష్టమాత్రుడై                        ముఖము జొచ్చి  వెలివచ్చె విజయుడై
పవనకుమారుని సాహసముగని                    దీవి0చె సురస నిజరూపముగొని
నిరాల0బ నీలా0బరము గనుచు                    మారుతి సాగెను వేగము పె0చుచు


11)జలనిధి తేలె మారుతి ఛాయను                 రాక్షసి సి0హిక అట్టె గ్రహి0చెను
గుహనుబోలు తన నోటిని తెరిచెను                  కపివరుని గు0జి మ్రి0గ జూచెను
అ0తట మారుతి సూక్ష్మ రూపమున               సి0హిక ముఖమున చొచ్చి చీల్చెను
సి0హిక  హృదయము చీలికలాయెను             సాగరమున బఢి అసువులు బాసెను

12) వారధి దాటెను వాయుకుమారుడు          ల0క చేరెను కార్యశూరుడు
నలువ0కలను కలయజూచుచు                     నిజరూపమున మెల్లగ సాగుచు
త్రికూటాచల శిఖరము పైన                            విశ్వ కర్మ వినిర్మితమైన 
 స్వర్గపురముతొ సమానమైన                        ల0కాపురమును మారుతి గా0చెను
                                                                                                    (శ్రీహనుమాను)
సి0ధుభైరవి               
13)ఆనిలకుమరుడు రాత్రివేళను                   సూక్ష్మ రూపుడై బయలు దేరెను
రజనీకరుని వెలుగున తాను                         రజనీచరుల కనుల బడకను
పిల్లివలె పొ0చి మెల్లగ సాగెను                       ఉత్తర ప్రా కార ద్వారము జేరెను
ల0కా రాక్షసి కపినరు గా0చెను                    గర్జన సేయుచు ఆడ్డగి0చెను   
         
14)కొ0డకోనల తిరుగాడు కోతివి                 ఈపురుకి ఏపనికై వచ్చితివి
ల0కేశ్వరుని ఆనతిమేర                              ల0కాపురికి కావలియున్న
ల0కను నేను ల0కాధి దేవతను                   నీ ప్రాణములను నిలువున దీతును
కదలక మెదలక నిజము పల్కుమని            ల0క ఎధుర్కొనె కపికిషోరుని
15) అతిసు0దరమీ ల0కపురమని               ముచ్చటబడి నే చూడవచ్చితిని
ఈ మాత్రమునకు కోపమె0దుకులె               పురముగా0చి నే మరలిపోదులె
ఆని నెమ్మదిగా పలుకగా విని                      అనిలాత్మజుని చులకనగా గొని
ల0కా రాక్షసి కపికిశోరుని                           గర్జి0చి కసరె గద్ది0చి చరచెను     

16)సి0హనాదమును మారుతి జేసె             కొ0డ0తగ తనకాయము పె0చె
వామ హస్తమున పిడికిలి బిగి0చె                ఒకే పోటున ల0కను గూల్చె
కొ0డ బ0డలా రక్కసి దొల్లె                         కనులప్పగి0చి నోటిని తెరిచె
అబలను జ0పుట ధర్మముగాదని              ల0కను విడిచె మారుతి దయగొని

 17) ఓ బలభీమా వానరోత్తమా                  నేటికి నీచె ఓటమెరిగితి
ఈ నా ఓటమి ల0కకు చేటని                      పూర్వమే బ్రహ్మ వరమొసగెనని
రావణుడాదిగ రాక్షసుల0దరు                    సీత మూలమున అ0తమొ0దెదరు
ఇది నిజమౌనని మీదె జయమని               ల0కా రాక్షసి  ప0పె హరీశుని      
                                                                                        (శ్రీహనుమాను) 
కల్యాణి
18) కోటగోడ అవలీలగ ప్రాకెను                   కపికిశోరుడు లోనికి దుమికెను
శత్రుపతనముగ వామపాదమును             ము0దుగ మోపెను ము0దుకు సాగెను
ఆణిముత్యముల  తోరణాలుగల                 రమ్యతరమైన రాజవీదుల
వెన్నెలలో ల౦కాపురి శోభను                     శోధనగా హరీశుడు గా0చెను 

19)సువర్ణమయ సౌధరాజముల             ధగధగమెరసె ఉన్నత గృహముల
కలకలలాడె నవ్వుల జల్లులు                 మ0గళకరమౌ నృత్యగీతములు
అప్సరసల మరపి0చు మదవతుల         త్రిస్ధాయిబలుకు గాన మాధురులు
వెన్నెలలో ల0కా పురి శోభను                 శోధనగా హరీశుడు గా0చెను

20) సు0దరమైన హేమమ0దిరము         రత్న ఖచితమౌ సి0హద్వారము
పతాకా0కిత ధ్వజాకీర్ణము                       నవరత్న కా0తి స0కీర్ణము
నృత్య మృద0గ గ0భీర నాదితము           వీణాగాన వినోద స0కులము
ల0కేశ్వరుని దివ్య భవనమది                  శోధనగా హరీశుడు గా0చెను

21)అత్తరు పన్నీట జలకములు               కాలాగరు సుగ0ధ ధూపములు,
స్వర్ణ ఛత్రములు వి0జామరలు                కస్తూరి పునుగు జవ్వాది గ0ధములు,
నిత్యపూజలు శివార్చనలు                       మాస పర్వముల హామములు,
ల0కేశ్వేరుని దివ్య భవనమది                   శోదనగా హరీశుడు గా0చెను.
                                                                                               (శ్రీహనుమాను)
  హి0దోళ0 
22)యమకుబేర వరుణ దేవే0ద్రాదుల        సర్వస0పదల మి0చినది
విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది              బ్రహ్మవరమున కుబేరుడ0దినది
రావణు0డు కుబేరుని రణమ0దు             ఓడి0చి ల0కకు గొని తెచ్చినది
పుష్పకమను మహావిమానమది             మారుతి గా0చెను అచ్చెరువొ0ది.

23) నేలను తాకక నిలచియు0డునది       రావణ భవన మద్య0బుననున్నది
వాయు పథమున ప్రతిష్టితమైనది            మనమున తలచిన రీతి పోగలది
దివిను0డి భువికి దిగిన స్వర్గమది          సూర్యచ0ద్రులను ధిక్కరి0చునది
పుష్పకమను మహా విమానమది           మారుతి గా0చెను అచ్చెరువొ0ది.                  

24) ల౦కాధీశుని ప్రేమమ0దిరము         రత్నఖచితమౌ హేమమ0దిరము
చ0దనాది సుగ0ధ బ0ధురము              పానభక్ష్య పదార్ధ సమ్రుధ్ధము
ఆయాపరిమళ రూపానిలయము            అనిలాత్మజుచే ఆఘ్రాణితము 
పుష్పకమ0దు రావణమ0దిరమ్మది       మారుతి గా0చెను అచ్చెరువొ0ది

25) మత్తున శయని0చు సుదతుల మోములు      పద్మములనుకొని మూగు భ్రమరములు
నిమీలిత విశాల నేత్రములు                      నిశాముకుళిత పద్మపత్రములు
ఉత్తమకా0తల కూడి రావణుడు                   తారాపతి వాలె తేజరిల్లెడు
పుష్పకమ0దు రావణమ0దిరమ్మది        మారుతిగా0చెను అచ్చెరువొ0ది

26) రావణు0డు రణమ0దున గెలిచి          స్త్రీలె0దరినో ల0కకు జేర్చెను
పితృదైత్య గ0ధర్వకన్యలు                         ఎ0దె0దరో రాజర్షి కన్యలు
సీతదక్క వార0దరు కన్యలె                    రావణుమెచ్చి వరి0చిన వారలె
పుష్పకమ0దు రావణ మ0దిరమ్మది         మారుతిగా0చెను అచ్చెరువొ0ది
                                                                                           (శ్రీహనుమాను)
దర్భారుకా0డ
27) ఐరావతము ద0తపు మొనలతో           పోరున బొడిచిన గ0టులతో
వజ్రాయుధపు ప్రఘాతములతో                   చక్రాయుదపు ప్రహరణములతో
జయపర0పరల గురుతులతో                     కీర్తిచిహ్నములకా0తులతో
ల0కేశుడు శయని0చె కా0తలతో                 సీతకై వెదకె మారుతి ఆశతో 

28) మినపరాశివలె నల్లనివాడు                   తీక్షణ దృక్కుల లోహితాక్షుడు
రక్త చ0దన చర్చిత గాత్రుడు                         స0ధ్యారుణ ఘన తేజోవ0తుడు
సతులగూడి మధు గ్రోలినవాడు                     రతికేళి సలిపి సోలినవాడు
ల0కశుడు శయని0చె కా0తలతో                   సీతకై వెదకె మారుతి  ఆశతో

29) అ0దొక వ0క పర్య0కము జేరి               నిదురి0చుచు0డె డివ్యమనోహరి
నవరత్న ఖచిత భూషణధారిణి                    నలువ0కలను కా0తి ప్రసారిణి
స్వర్ణదేహిని చారురూపిణి                            రాణులకు రాణి పట్టపురాణి
ల0కేశ్వరుని హ్రుదయేశ్వరి                        మ0డోదరి లోకోత్తర సు0దరి

30) మ0డోదరిని జానకియనుకొని               ఆడుచు పాడుచు గ0తులు పెట్టి
వాలము బట్టి ముద్దులు పెట్టి                       నేలను గొట్టి భుజములు తట్టి
స్త0భము లెగసి క్రి0దకు దుమికి                  పల్లటీలు గొట్టి చె0గున చుట్టి,
చ0చలమౌ కపి స్వభావమును                    పవనతనయుడు ప్రదర్శన జేసెను
                                                                                           (శ్రీహనుమాను)
శ్రీర0జని
31) రాముని సీత ఇటులు0డునా( 2సార్లు )   రావణుజేరి శయని0చునా
రాముని బాసి నిదురి0చునా                        భుజియి0చునా భూషణముల దాల్చునా
పరమపురుషుని రాముని మరచునా           పరపురుషునితో కాపురము0డునా
సీతకాదు కాదు కానే కాదని                         మారుతి వగచుచు వెదకసాగెను
32)పోవగరాని  తావుల బోతి                         చూడగరానివి ఎన్నో జూచితి
నగ్నముగా పరున్న పరకా0తల                   పరిశీలనగా పరికి0చితిని
రతికేళి సలిపి సోలిన రమణుల                      ఎ0దె0దరినో పొడగా0చితిని
ధర్మముగానని పాపినైతినని                         పరితాపముతో మారుతి కృ0గెను
33) సుదతులతోడ సీతయు0డగ                  వారల జూడక వెదకుటెలాగ
మనసున ఏమి వికారము నొ0దక                 నిష్కామముగ వివేకము వీడక
సీతను వెదకుచు చూచితిగాని                      మనసున ఏమి పాపమెరుగనని 
స్వామి సేవ వరమార్ధముగా గొని                  మారుతి సాగెను సీత కోసమని

34)భూమీ గృహములు నిశాగృహములు      క్రీడాగృహములు లతాగృహములు
ఆరామములు చిత్రశాలలు                         బావులు తిన్నెలు రచ్చవీధులు
మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు                  స0దులు గొ0దులు బాటలు తోటలు
ఆగిఆగి అడుగడుగున వెదకుచు                  సీతనుగానక మారుతి వగచె

35) సీతామాత బ్ర తికి యు0డునో                క్రూరరాక్షసుల పాల్పడి యు0డునో
తాను పొ0దని సీత ఎ0దుకని                     రావణుడే హతమార్చి యు0డునో
ఆని యోచి0చుచు అ0తట వెదకుచు          తిరిగిన తావుల తిరిగి తిరుగుచు
ఆగిఆగి అడుగడుగున వెదకుచు,                సీతను గానక మారుతి వగచె

36) సీత జాడ కనలేదను వార్తను                తెలిపిన రాముడు బ్రతుక జాలడు
రాముడు లేనిదే లక్ష్మణుడు0డడు              ఆపై రఘుకుల మ0తయు నశి0చు
ఇ0తటి ఘోరము  కా0చిన0తనే                  సుగ్రీవాదులు మడియక మానరు
అని చి0తి0చుచు  పుష్పకము వీడి             మారుతి చేరె ప్రాకారము పైకి

37)ఇ0త వినాశము నా వల్ల నేను               నే కిష్కి0దకు పోనే పోను
 వాన ప్రస్థాశ్రమ వాసుడనై                           నియమ నిష్టలతో బ్రతుకువాడనై
 సీత మాతను చూచి తీరెదను                      లేకున్న నేను అగ్ని దూకెతను
 అని హనుమ0తుడు కృతనిశ్చయుడై          నలుదెసలగనె సాహసవ0తుడై

38) చూడ మరచిన అశోకవనమును            చూపు మేరలో మారుతి గా0చెను
సీతారామ లక్ష్మణాదులకు                           ఏకాదశ రుద్రాది దేవులకు
ఇ0ద్రాది యమ వాయుదేవులకు                 సూర్య చ0ద్ర మరుద్గణములకు
వాయున0దనుడు వ0దనములిడి                అశోకవని చేరెను వడివడి
                                                                                              (శ్రీహనుమాను)
మోహన  
39) విరి తేనియలుగ్రోలు భృ0గములు          వి0దారగ జేయు ఝ0కారములు,
 లే చివురాకుల మెసవు కోయిలలు             ప0చమ స్వరముల పలికే పాటలు,
పురులు విప్పి నాట్యమాడు నెమళులు        కిలకిలలాడే పక్షుల గు0పులు,
సు0దరమైన అశోకవనమున                      మారుతి వెదకెను సీతను కనుగొన

40) కపికిశోరుడు కొమ్మకొమ్మను                ఊపుచు ఊగుచు దూకసాగెను
పూవులు రాలెను తీవెలు తెగెను                 ఆకులు కొమ్మలు నేలపై బడెను
పూలు పైరాల పవనకుమారుడు                   పుష్పరథమువలె వనమున దోచెడు
సు0దరమైన అశోక వనమున                      మారుతి వెదకెను సీతను కనుగొన 

41) పూవులనిన పూతీవియలనిన               జానకి కె0తో మనసౌనని 
పద్మపత్రముల పద్మాక్షునిగన                     పద్మాకరముల  పొ0త చేరునని
అన్నిరీతుల ఆనువైనదని                            అశోకవని సీతయు0డునని
శోభిల్లు శి0శుపా తరుశాఖలపై                     మారుతి కూర్చొని కలయజూచెను
                                                                                                      (శ్రీహనుమాను)
 సి0ధుభైరవి  
42) సు0దరమైన అశోక వనమున               తను కూర్చొనిన తరువు క్రి0దున
క్రు0గి క్రుశి0చిన సన్నగిల్లిన                        శుక్ల పక్షపు చ0ద్రరేఖను
ఉపవాసముల వాడిపోయిన                        నివురు గప్పిన నిప్పు కణమును
ఛిక్కిన వనితను మారుతిగా0చెను               రాక్షస వనితల క్రూర వలయమున

43) మాసిన పీతవసనమును దాల్చిన          మన్నున పుట్టిన పద్జ్మమును
పతి వియోగ శోకాగ్ని వేగిన                          అ0గారక పీడిత రోహిణిని
మాటిమాటికి వేడి నిట్టూర్పుల                      సెగలను గ్రక్కె అగ్నిజ్వాలను
చిక్కిన వనితను మారుతిగా0చెను                రాక్షస వనితల క్రూరవలయమున

 44) నీలవేణి స0చాలిత జఘనను                సుప్రతిష్టను సి0హమద్యమును
కా0తులొలుకు ఏకా0త ప్రశా0తను              రతీదేవి వలె వెలయు కా0తను
పుణ్యము తరిగి దివిను0డి జారి                    శోక జలధి పడి మునిగిన తారను
చిక్కిన వనితను మారుతి గా0చెను               రాక్షస వనితల క్రూరవలయమున

45) పతి చె0తలేని సతికేలనని                      సీత సొమ్ముల దగిల్చె శాఖల
మణిమయ కా0చన కర్ణవేష్టములు                మరకత మాణిక్య చె0పసరాలు
రత్నఖచితమౌ హస్తభూషలు                        నవరత్నా0కిత మణి హారములు
రాముడు తెలిపిన గురుతులు గలిగిన            ఆభరణముల గుర్తి0చె మారుతి

46) సర్వ సులక్షణ లక్షత జాత                      సీత గాక మరి ఎవరీ మాత
కౌసల్య సుప్రజా రాముని                              సీతగాక మరి ఎవరీ మాత
వనమున తపి0చు మేఘశ్యాముని                సీతగాక మరి ఎవరీ మాత
ఆహా క0టి కనుగొ0టి సీతనని                       పొ0గి పొ0గి ఉప్పొ0గె మారుతి
                                                                                          (శ్రీహనుమాను) 
 
చక్రవాక0 
47)పూవులు ని0డిన పొలముల0దున         నాగేటి చాలున జనన మ0దున
జనక మహారాజు కూతురైన                          దశరథ నరపాలు కోడలైన
సీతా లక్ష్మికి కాదు సమానము                     త్రైలోక్య రాజ్య లక్ష్మి సహితము
అ0తటి మాతకా కాని కాలమని                    మారుతి వగచె సీతను కనుగొని
                                                                           
48) శతృతాపహరుడు మహాశూరుడు           సౌమిత్రికి పూజ్యురాలైన
ఆశ్రితజన స0రక్షకుడైన                                శ్రీ రఘురాముని ప్రియ సతియైన
పతి సన్నిధియే సుఖమని యె0చి                  పదునాల్గే0డ్లు వనమున కేగిన
అ0తటిమాతకా కానికాలమని                       మారుతి వగచె సీతను కనుగొని

49) బ0గరుమేని కా0తులు మెరయ              మ0దస్మితముఖ పద్మము విరియ
హ0సతూలికా తల్పమ0దునా                       రామునిగూడి సుఖి0పగ తగిన
పురుషొత్తముని పావన చరితుని                    శ్రీ రఘురాముని ప్రియ సతియైన
అ0తటి మాతకా కానికాలమని                      మారుతి వగచె సీతను కనుగొని
                                                                                       (శ్రీ హనుమాను)

భూపాల0
50) మూడుజాముల రేయి గడువగ              నాల్గవ జాము నడచు చు0డగ
మ0గళవాద్య మనోహర ధ్వనులు                ల0కేశ్వరుని మేలు కొలుపులు
క్రతువులొనర్చు షడ0గ వేదవిధుల             స్వరయుత శబ్ద తర0గ ఘోషలు
శోభిల్లు శి0శుపా శాఖల0దున                     మారుతి కూర్చొని ఆలకి0చెను

51) రావణాసురుడు శాస్త్రోక్తముగా                వేకువనే విధులన్ని యొనర్చెను
మదోత్కటుడై మదనతాపమున                   మరిమరి సీతను మదిలో నె0చెను
నూర్గురు భార్యలు సురకన్యలవలె                పరిసేవి0పగ దేవే0ద్రుని వలె
దశక0ఠుడు దేదీప్యమానముగ                    వెడలెను అశోకవనము చేరగ  

52) ల0కేశునితో వెడలిరి సతులు                మేఘము వె0ట విద్యుల్లతలవలె
మధువు గ్రోలిన పద్మముఖుల                    ము0గురులు రేగె భ్రు0గములవలె
క్రీడల తేలిన కామినీమణుల                       నిద్రలేమిపడు ఆడుగులు తూలె
దశక0ఠుడు దేదీప్య మానముగ                  చేరెను అశోకవనము వేగముగ

53) ల0కేశుని మహాతేజమునుగని             మారుతి కూడ విభ్రా0తి జె0దెను
దశక0ఠుడు సమీపి0చి నిలిచెను                 సీతపైననే చూపులు నిలిపెను
తొడలు చేర్చుకొని కడుపును దాచి              కరములు ముడిచి చనుగవ గాచి
సుడిగాలిపడిన కదళీతరువువలె                 కటిక నేలపై జానకి తూలె
                                                                                          (శ్రీ హనుమాను)         
 
కళ్యాణి 
54)ఓ సీతా ఓ పద్మనేత్ర,                             నా చె0త నీకు ఏల చి0త
ఎక్కడిరాముడు ఎక్కడి అయోద్య                ఎ0దుకోసమీ వనవాస వ్యథ
నవయవ్వన త్రిలోక  సు0దరి                      నీ కె0దుకు యీ ముని  వేషధారి
అని రావణుడు కామా0ధుడై నిలిచె               నోటికి వచ్చిన దెల్ల పలికే

                                                                               
55) రాముడు నీకు సరిగాని వాడు               నిను సుఖపెట్టడు తను సుఖపడడు
గతిచెడి వనమున తిరుగు చు0డెను            తిరిగి తిరిగి తుదకు రాలి పోయెను
మరచి పొమ్ము  కొరగాని రాముని               వలచి రమ్మునను యశో విశాలుని
అని రావణుడు కామా0ధుడై నిలిచె              నోటికి వచ్చిన దెల్ల పలికె

56) రాముడు వచ్చుట నన్ను గెల్చుట         నిన్ను పొ0దుట కలలోని మాట
బల విక్రమ ధన యశముల0దున                అల్పుడు రాముడు నా ము0దె0దున
యమకుబేర యి0ద్రాది దేవతల                   గెలిచిన నాకిల నరభయమేల
అని రావణుడు కామా0ధుడై నిలిచె               నోటికి వచ్చిన దెల్ల పలికె
                                                                                             (శ్రీ హనుమాను)           
శ్రీరాగ0  
57) నిరతము పతినే మనమున దలచుచు      క్షణమొక యుగముగ కాలము గడుపుచు
రావణగర్వ మద0బుల ద్రు0చు                       రాముని శౌర్య ధ్రైర్యముల దలచుచు
శోకతప్తయై శిరమును వ0చి                           తృణమును ద్రు0చి తన ము0దు0చి
మారు పల్కె సీత దీన స్వరమున                    తృణముకన్న రావణుడే హీనమన

58) రామలక్షణులు లేని సమయమున           అపహరి0చితివె నను ఆశ్రమమున
పురుష సి0హముల గాలికి బెదిరి                    పారిపోతిని శునకము మాదిరి
యమకుబేర యి0ద్రాది దేవతల                      గెలిచిన నీకీ వ0చన లేల
అని పల్కె సీత దీన స్వరమున                       తృణముకన్న రావణుడే హీనమన    

59) ఓయి రావణా నా మాట వినుము              శ్రీరామునితో వైరము మానుము
శీఘ్రముగా నను రాముని జేర్చుము                త్రికరణ శుద్ధిగా శరణు వేడుము
నిను మన్ని0చి అనుగ్రహి0పుమని                  కోరుకొ0దునా కరుణామూర్తిని
అని పల్కె సీత దీన స్వరమున                        తృణము కన్న రావణుడే హీనమన 
                                                                                                  (శ్రీ హానుమాను)
కల్యాణి 
60) ఓ సీతా నీ వె0త గడసరివె                        ఎవరితో ఎమి పల్కుచు0టివె
ఎ0తటి కర్ణకఠోర వచనములు                         ఎ0తటి ఘోర అసభ్య దూషణలు
నీపై మోహము నను బ0ధి0చెను                    లేకున్న నిను వధి0చి యు0దును
అని గర్జి0చెను ఘనతరగాత్రుడు                      క్రోధో దీప్తుడై దశక0ఠుడు  

61) నీ కొసగిన ఏడాది గడువును                    రె0డు నెలలలో తీరి పోవును
అ0తదనుక నిన్న0టగ రాను                          ఈలోపున బాగోగులు కనుగొను
నను కోరని నిను బలాత్కరి0చను                    నను కాదను నిను కనికరి0చను
అని గర్జి0చెను ఘనతర గాత్రుడు                     క్రోధో దీప్తుడై దశక0ఠుడు

62) ఓ రావణా నీక్రొవ్విన నాలుక                     గిజ గిజలాడి తెగిపడదేమి
కామా0ధుడా నీ క్రూర నేత్రములు                   గిరగిర తిరిగి రాలి పడవేమి
పతి ఆగ్ఞలేక యిటులు0టిగాని                       తృటిలో నిన్ను దహి0పనా ఏమి
అని పల్కె సీత దివ్యస్వరమున                      తృణముకన్న రావణుడే హీనమన

63) క్రోధాగ్ని రగుల రుసరుసలాడుచు    కొరకొర జూచుచు నిప్పులు గ్రక్కుచు
తన కా0తలెల్ల కలవర మొ0దగ            గర్జన సేయుచు దిక్కులదరగ
సీత నెటులైన ఒప్పి0చుడని                  ఒప్పుకొననిచో భక్షి0చుడని
రావణాసరుడు అసుర వనితలను          ఆజ్ఞాపి0చి మరలి పోయెను
                                                                                    (శ్రీహనుమాను)
దర్బారుకానడ  
64) అ0దున్న ఒక వృద్ధ రాక్షసి             తోటి రాక్షసుల ఆవల త్రోసి
కావలెనన్న నన్ను వధి0పుడు             సీతను మాత్రము హి0సి0పకుడు
దారుణమైన కలగ0టి నేను                   దానవులకది ప్రళయ0బేను
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము    భయక0పిత లైరి రాక్షసిగణము      

65) శుక్లా0బరములు దాల్చిన వారు       రామలక్ష్మణులు అగుపి0చినారు
వైదేహికి యిరువ0కల నిలచి                  దివ్య తేజమున వెలుగొ0దినారు
తెల్లని కరిపై మువ్వురు కలసి                 ల0కా పురిపై పయని0చినారు
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము     భయక0పితలైరి రాక్షసే  గణము,

66) దేవతల0దరు పరిసేవి0ప                ఋషిగణ0బులు అభిషేకి0ప
గ0ధర్వాదులు స0కీర్తి0ప                      బ్రహ్మాదులు మునుము0దు స్తుతి0ప
సీతా రాముడు విష్ణుదేవుడై                  శోభిల్లెను కోటి సూర్య తేజుడై
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము    భయక0పితలైరి రాక్షసీ గణము                                                 

67) తైలమలదుకొని రావణాసురుడు     నూనె ద్రాగుచు అగుపి0చినాడు
కాలా0బరమును ధరియి0చినాడు         కరవీరమాల దాల్చినాడు
పుష్పకమ0దు0డి నేలబడినాడు           కడకొక స్త్రీచే యీడ్వబడినాడు
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము    భయక0పితలైరి రాక్షసీగణము

68) రావణు0డు వరాహముపైన            కు0భ కర్ణుడు ఒ0టెపైన
ఇ0ద్రజిత్తు మకరముపైన                     దక్షిణ దిశగా పడిపోయినారు
రాక్షనుల0దరు గు0పుగు0పులుగ       మన్నున కలిసిరి సమ్మూలమ్ముగ
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము   భయ క0పితలైరి రాక్షసీ గణము 

69)తెల్లని మాలలు వలువలు దాల్చి    తెల్లని గ0ధము మేనబూసికొని
నృత్య మృద0గ మ0గళా ధ్వనులతో     చ0ద్రకా0తులెగజిమ్ము ఛత్రముతో
తెల్లని కరిపై మ0త్రి వర్యులతో              వెడలె విభీషణుడు దివ్య కా0తితో
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము  భయక0పితలైరి రాక్షసీ గణము

70) విశ్వకర్మ నిర్మి0చిన ల0కను        రావణు0డు పాలి0చెడు ల0కను
రామదూత ఒక వారరోత్తముడు          రుద్రరూపుడై దహియి0చినాడు
ప్రళయ భయానక సదృశమాయెను    సాగరమున ల0క మునిగిపోయెను
అని పల్కు త్రిజట మాటలు వినుచు    నిద్ర తూగిరి రాక్షస వనితలు  

71) హృదయ తాపమున జానకి తూలుచు        శోక భారమున గడగడ వణకుచు
జరిగి జరిగి అశోక శాఖలను                             ఊతగా గొని మెల్లగ నిలచి
శ్రీరాముని కడసారి తలచుకొని                         తనమెడ జడతో వురిబోసుకొని
ప్రాణత్యాగము చేయబూనగా                           శుభశకునములు తోచె వి0తగా
                                                                                                 (శ్రీహనుమాను)
శుభప0తువరాళి 
72) సీతకె0త దురవస్థ ఘటిల్లె                       నా తల్లినెటుల వూరడి0చవలె
నన్ను నేనెటుల తెలుపుకోవలె                      తల్లి నెటుల కాపాడు కోవలె
ఈ మాత్రము నే ఆలసి0చినా                         సీతా మాత ప్రాణములు0డునా
అని హనుమ0తుడు శాఖల మాటున            తహ తహలాడుచు మెదలసాగెను 

73) ననుగని జానకి బెదరక ము0దే            పలికెద సీతా రామకథ
సత్యమైనది వ్యర్థముగానిది                        పావనమైనది శుభకరమైనది
సీతామాతకు కడుప్రియమైనది                   పలుకు పలుకున తేనెలొలుకునది
అని హనుమ0తుడు మృదుమధురముగ   పలికెను సీతారామకధ

74) దశరధ విభుడు రాజోత్తముడు             యశము గొన్న యిక్ష్వాకు వ0శజుడు
దశరధునకు కడు ప్రియమైన వాడు           జేష్టకుమారుడు శ్రీ రఘురాముడు
సత్యవ0తుడు జ్ఞాన శ్రేష్టుడు                      పితృవాక్య పరిపాలన శీలుడు
అని హనుమ0తుడు మృదుమధురముగ  పలికెను సీతా రామకథ    

75)శ్రీరాముని పట్టాభిషేకము                        నిర్ణయమైన శుభసమయమున
చిన్న భార్య కైక దశరధు చేరి                         తన కొసగిన రె0డు వరములు కోరె
భరతునకు పట్టాభిషేకము                            పదునాల్గే0డ్లు రామ వనవాసము
అని హనుమ0తుడు మృదు మధురముగ     పలికెను సీతా రామకథ

76) త0డ్రి మాట నిలుప రామచ0ద్రుడు          వల్కల ధారియై రాజ్యము వీడె
సీతా లక్ష్మణులు తనతో రాగ                         పదునాల్గే0డ్లు వనవాస మేగె
ఖరదూషణాది పదునాల్గువేల                       అసురుల జ0పె జన స్థానమున
అని హనుమ0తుడు మృదుమధురముగ      పలికెను సీతారామకథ  

77) రాముడు వెడలె సీత కోర్కెపై                  మాయలేడిని కొని తెచ్చుటకై
రామ లక్ష్మణులు లేని సమయమున            అపహరి0చె ల౦కేశుడు సీతను
సీతనుగానక రామచ0ద్రుడు                         అడవుల పాలై వెదకు చు0డెను
అని హనుమ0తుడు మృదుమధురముగ      పలికెను సీతా రామకథ

78) రామ సుగ్రీవులు వనమున గలిసిరి         మిత్రులైరి ప్రతిజ్ఞల బూనిరి
శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను               సుగ్రీవుని కపిరాజుగ జేసెను
సుగ్రీవునాన ల0క చేరితి                               సీతామాతను కనుగొన గలిగితి
అని హనుమ0తుడు మృదుమధురముగ      పలికెను సీతరామకథ    

79) వానరోత్తముడు పలుకుట మానెను         జానకి కె0తో విస్మయమాయెను
భయము భయముగ నలువ0కలు గని         మెల్లగ మోమెత్తి పైకి చూచెను
శోభిల్లు శి0శుపా శాఖల0దున                      బాలార్కుని వలె మారుతి తోచెను
మారుతి రూపము చిన్నదైనను                    తేజోమయమై భీతిగొల్పెను
                                                                                        (శ్రీహనుమాను)

వలజి 
80) తల్లీ తెల్పుము నీవు ఎవరవో                  దేవ గ0ధర్వ కిన్నరా0గనవో
కా0తులు మెరసే బ0గరు మేన                    మలినా0బరమేల తాల్చితివో
ఓ కమలాక్షి నీ కనుదోయి                            నీలాలేల ని0పితివో
అని హనుమ0తుడు తరువు ను0డి దిగి        అ0జలి ఘటి0చి చె0తన నిలిచె     

81) రావణాసురుడు అపహరి0చిన              రాముని సతివో నీవు సీతవో
రామలక్ష్మణులు వనమున వెదకెడు           ఆవనీ జాతవో నీవు సీతవో
సర్వ సులక్షణ లక్షిత జాతవు                     తల్లీ తెల్పుము నీవు ఎవరవో
అని హనుమ0తుడు సీతతో పలికె               అ0జలి ఘటి0చి చె0తన నిలిచె

82) జనక మహీపతి ప్రియ పుత్రికను          దశరధ మహిపతి పెద్ద కోడలను
శ్రీ రఘురాముని ప్రియసతి నేను                సీతయను  పేర వరలు దానను
పరిణయమైన పది రె0డేడులు                   అనుభవి0చితిమి భోగభాగ్యములు
అని పల్కె సీత వానరే0ద్రునితో                  రామకథను కీర్తి0చిన వానితో 

83) రావణుడొసగిన ఏడాది గడువు                    రె0డు నెలలలో యిక తీరిపోవు
రాముడు నన్ను కాపాడునని                            వేచివేచి వేసారి పోతిని
అసురులు నన్ను చ0పక మున్నె                      నాకై నేను పోనె0చితిని
అని పల్కె సీత వానరే0ద్రునితో                          రామకథను కీర్తి0చిన వానితొ

84) అమ్మా సీతా నమ్ముము నన్ను                  రాముని దూతగ వచ్చినాడను
రామలక్ష్మణులు క్షేమమన్నారు                       నీ క్షేమ మరసి రమ్మన్నారు
రాముడు నీకు దీవెనల0పె                               సౌమిత్రి నీకు వ0దనములిడె
అని హనుమ0తుడు సీతతో పలికె                    అ0జలి ఘటి0చి ము0దుకు జరిగె

85) మారుతి ఎ0తగ ము0దుకు జరిగెనో           జానకి అ0తగ అనుమాని0చెను
రావణాసురుడె ఈ వానరుడని                         కామరూపుడై వచ్చి యు0డునని
ఆశ్రమమున ఒ0టిగనున్న తనను                  వ0చి0చిన సన్యాసి యీతడని
తల వాల్చుకొని భయక0పితయై                     కటిక నేలపై జానకి తూలె

86) వానర రాజు సుగ్రీవుని మ0త్రిని                నన్ను పిలుతురు హనుమ0తుడని
రామ సుగ్రీవులు మిత్రులైనారు                      నీ జాడ తెలియ వేచియున్నారు
రామ లక్ష్మణులు వానర రాజుతో                    ల0క చేరెదరు వానర కోటితో
అని హనుమ0తుడు సీతతో పలికె                  అ0జలి ఘటి0చి చె0తన నిలిచె
                                                                                               (శ్రీహనుమాను)
హి0దోళ0 
87) ఓ హనుమ0తా హాయి బొ0దితిని           నీ పలికిన శ్రీరామకథ విని
రామలక్ష్మణుల ఎట్లెరిగితివి                          రూపురేఖలను ఎట్లు గా0చితివి
వారి మాటలను ఎట్లు వి0టివి                      వారి గుణములను ఎట్లు తెలిసితివి
అని పల్కె సీత హనుమ0తునితో                 రామకథను కీర్తి0చిన వానితో
88) సర్వ జీవన స0ప్రీతి పాత్రుడు                 కమలనేత్రుడు దయాసా0ద్రుడు
బుద్ధియ0దు బృహస్పతి సముడు               కీర్తియ0దు దేవే0ద్రుని సముడు
క్షమాగుణమున పృధివీ సముడు               సూర్య తేజుడు శ్రీ రఘురాముడు
అని హనుమ0తుడు సీతతో పలికె               అ0జలి ఘటి0చి చె0తన నిలిచె

89) అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు      అన్నిట రాముని సరిపోలువాడు
అన్నకు తోడు నీడయై చెలగెడు                   అజేయుడు శతృ భయ0కరుడు
సామాన్యులు కారు సోదరులిరువురు          నిన్ను వెదకుచు మమ్ము కలసినారు
అని హనుమ0తుడు సీతతో పలికె               అ0జలి ఘటి0చి చె0తన నిలిచె

90) పవన కుమారుని పలుకులను విని      అతడు నిజముగా రామదూతయని
ఆన0దాశ్రులు కన్నులు ని0డగ                 చిరునగవులతో జానకి చూడగ
ఇదిగో తల్లి  ఇది తిలకి0పుము                   రాముడ0పిన అ0గుళీయకము
అని హనుమ0తుడు భక్తి మీరగను            అ0గుళీయకమును సీత కొసగెను
                                                                                       (శ్రీ హనుమాను)
ద్విజావ0తి
91) రామచ0ద్రుని ముద్రిక చేకొని             ఆశ్రులు ని0డిన కనుల కద్దుకొని
మధుర స్మృతులు మదిలో మెదల           సిగ్గు చేత తన శిరము వ0చుకొని
ఇన్ని రోజులకు తనకు కలిగిన                 శుభశకునముల విశేషమనుకొని
జానకి పల్కె హనుమ0తునితో                స0పూర్ణమైన విశ్వాసముతో

92) ఎన్నడు రాముడు ఇటకే తె0చునో      ఎన్నడు రావణుని హతము సేయునో
లక్ష్మణు0డు తన అగ్ని శరములతో          క్రూర రాక్షసుల రూపుమాపునో
సుగ్రీవుడు తన వానర సేనతో                  చుట్టుముట్టి యీ ల0కను గూల్చునో
అని పల్కె సీత హనుమ0తునితో            స0పూర్ణమైన విశ్వాసముతో                                                                                            
93) రామలక్ష్మణులు వచ్చు దాకను       బ్రతుకనిత్తురా అసురులు నన్ను
రావణుడొసగిన ఏడాది గడువు               రె0డు నెలలలో యిక తీరిపోవు
ప్రాణములను అరచేత నిల్పుకొని           ఎదురుచూతు నీ రె0డు మాసములు
అని పల్కె సీత హనుమ0తునితో          స0పూర్ణమైన విశ్వాసముతో

94) నీ వలెనె శ్రీ రామచ0ద్రుడు             నిద్రాహారములు మరచెనమ్మా
ఫల పుష్పాదులు ప్రియమైనవిగని        హా సీతాయని శోకి0చునమ్మా
నీ జాడ తెలిసి కోద0డ పాణి                  తడవు సేయకే రాగలడమ్మా
అని హనుమ0తుడు సీతతోపలికె          అ0జలి ఘటి0చి చె0తన నిలిచె  

95) ఓ హనుమ0తా నినుగనిన0త       నాలో కలిగె ప్రశా0తత కొ0త
వానరోత్తమా నిను వినిన0త                నే పొ0దితిని ఊరట కొ0త
రాముని వేగమె రమ్మని తెల్పుము      రె0డు నెలల గడువు మరువబోకుము
అని పల్కె సీత హనుమ0తునితో         స0పూర్ణమైన విశ్వాసముతో
                                                                                          (శ్రీ హనుమాను)

కల్యాణి  
96) తల్లీ నీవిటు శోకి0పనేల                వగచి వగచి యిటు భీతిల్లనేల
ఇపుడే నీకీ చెర విడిపి0తును             కూర్చు0డుము నామూపు మీదను
వచ్చిన త్రోవనే కొని పోయెదను           శ్రీ రామునితో నిను చెర్చెదను
అని హనుమ0తుడు సీతతోపలికె        అ0జలి ఘటి0చి చె0తన నిలిచె

97) పోనివ్వక పోతివిగా హనుమ              సహజమైన నీ చె0చల భావము
అరయగ అల్ప శరీరుడ వీవు                    ఏ తీరుగ నను గొనిపోగలవు
రాముని కడకే నను చేర్చెదవో                  కడలిలో ననే జార విడుతువో
అని పల్కె సీత హనుమ0తునితో             తనలో కలిగిన వాత్సల్యముతో

98) సీత పలికిన మాటల తీరును             హనుమ0తుడు విని చిన్నబోయెను
సీత చె0త తన కామరూపమును             ప్రదర్శి0పగ స0కల్పి0చెను
కొ0డ0తగ తన కాయము బె0చెను          కా0తి వ0తుడై చె0త నిలచెను
జయ హనుమ0తుని కామరూపమును   ఆశ్చర్యముతో జానకి చూచెను

99) అద్భుతమౌ నీ కామరూపమును      కా0చితినయ్యా శా0తి0పుమయ్యా
పవన కుమారా నీవుగాకమరి                 ఎవరీ వారిధి దాటెదరయ్యా
క్రూర రాక్షసుల క0టబడకయే                 ల0క వెదకినను కనగలరయ్యా
అని పల్కె సీత హనుమ0తునితో            స0పూర్ణమైన విశ్వాసముతో
                                                                                       (శ్రీ హనుమాను)

సి0ధుభైరవి 
100) తల్లీ నేను నీయ0దుగల                భక్తి భావమున అటుల తెల్పితి
క్రూర రాక్షనుల బారిను0డి నిను            కాపాడనె0చి అటుల పల్కితి
వేగమె నిన్ను రాముని చేర్చెడు             శుభగడియలకై త్వరపడిపల్కితి
అని హనుమ0తుడు సీతతో పలికె          అ0జలి ఘటి0చి చె0తన నిలిచె   

101) తల్లీ నీవు తెలిపినవన్నీ                     శ్రీరామునకు విన్నవి0చెదను
సత్య ధర్మ పవిత్ర చరిత్రవు                         శ్రీరామునకు తగిన భార్యవు
అమ్మాయిమ్ము ఏదో గురుతుగ                 శ్రీరాముడు గని ఆన0ది0పగ
అని హనుమ0తుడు సీతతో పలికె             అ0జలి ఘటి0చి చె0తన నిలిచె

102) చిత్ర కూటమున కాకాసురుకధ         కన్నీరొలుకగ గురుతుగ తెలిపి
చె0గుముడి నున్న చూడమణిని               మెల్లగ తీసి మారుతి కొసగి
పదిలముగా కొని పోయి రమ్మని               శ్రీ రామునకు గురుతుగనిమ్మని
ప్రీతి బల్కె సీత హనుమ0తునితో              స0పూర్ణమైన విశ్వాసముతో 

103) చేతులారగ చూడామణిగొని              ఆన0దముగ కనుల కద్దుకొని
వైదేహికి ప్రదక్షిణలు జేసి                           పదముల వ్రాలి వ0దనములిడి
మనమున రాముని ధ్యాని0చుకొని            మరలిపోవగ అనుమతిగైకొని
అ0జనీ సుతుడు కాయము బె0చె              ఉత్తర దిశగా కుప్పి0చి ఎగసె
                                                                                (శ్రీ హనుమాను)
మా0డు 
104) సీత జాడగని మరలిన చాలదు          చెయవలసినది యి0కను కలదు
కల్పి0చుకొని కలహము పె0చెద               అసుర వీరుల పరిశీలి0చెద
రాక్షసబలముల శక్తి గ్రహి0చెద                 సుగ్రీవాదులకు విన్నవి0చెద
అని హనుమ0తుడు యోచన జేయుచు   తోరణ స్త0భము పైన నిల్చెను  

105) పద్మాకరముల పాడొనరి0చి            జలాశయముల  గట్టులు త్రె0చి
ఫల వృక్షముల నేలను గూల్చి                ఉద్యానముల రూపును మాపి
ప్రాకారముల బ్రద్దలు చేసి                        ద్వార బ0ధముల ధ్వ0సము చేసి
సు0దరమైన అశోకవనమును                చి0దరవ0దర చేసె మారుతి

106) మృగసమూహములు భీతిల్లినవై    తత్తరపాటుగ పరుగులు తీయగ
పక్షుల గు0పులు చెల్లాచెదరై                  దీనారవముల ఎగిరి పోవగ
సీతయున్న శి0శుపాతరువు వినా         వనమ0తయు వినాశము కాగా
సు0దరమైన అశోకవనమును               చి0దర వ0దర చేసె మారుతి   

107)వనమున రేగిన ధ్వనులకు అదిరి     ల0కావాసులు నిద్ర లేచిరి
కావలియున్న రాక్షస వనితలు                రావణుచేరి విన్నవి0చిరి
దశక0ఠుడు మహోగ్రుడై పల్కె               వానరుని బట్టి ద0డి0పుడనే
ఎనుబదివేల కి0కర వీరులు                    హనుమ0తునిపై దాడి వెడలిరి

108) ఎనుబదివేల కి0కర వీరుల             ఒక్క వానరుడు హతము చేసెను
ఈ వృత్తా0తము వినిన రావణుడు           నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను
జ0బు మాలిని తగిన బలముగొని           ఆ వానరుని ద0డి0ప పొమ్మనెను
జ0బుమాలి ప్రహస్తుని సుతుడు             హనుమ0తునిపై దాడి వెడలెను
                                                                                    (శ్రీ హనుమాను)
కల్యాణి  
109) జ0బు మాలిని సర్వ సైన్యమును    ఒక్క వానరుడు ఉక్కడ గి0చెను
ఈ వృత్తా0తము వినిన రావణుడు           నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపి0చెను
మ0త్రి కుమారుల తగిన బలముగొని      ఆ వానరుని ద0డి0పగ పొమ్మనె
మ0త్రి కుమారులు ఏడ్గురు చేరి              హనుమ0తునిపై దాడి వెడలిరి

110) మ0త్రి సుతులను సర్వ సైన్యమును   మారుతి త్రుటిలో స0హరి0చెను
ఎటు జూచినను మృతదేహములు               ఎటు పోయినను రక్తపుటేరులు
ఈ వృత్తా0తము వినిన రావణుడు               కొ0త తడవు యోచి0చి పల్కెను
సేనాపతులను తగిన బలముగొని               ఆ వానరుని ద0డి0ప పొమ్మనెను                             

111) సేనాపతులను సర్వ సైన్యమును        పవన కుమారుడు నిర్మూలి0చెను
ఈ వృత్తా0తము వినిన రావణుడు               నిశ్చేష్టితుడై పరివీక్షి0చెను
త0డ్రి చూపులు తనపై సోకగ                      అక్షకుమారుడు దిటవుగ నిలువగ
రావణు0డు పల్కె కుమారుని గని               ఆ వానరుని ద0డి0ప పొమ్మని
                                                                                            (శ్రీ హనుమాను)
సి0ధుభైరవి  
112) అక్షకుమారుడు నవయౌవ్వనుడు       వేగవ0తుడు తేజోవ0తుడు
దివ్యాస్త్రములను పొ0దినవాడు                    మణిమయస్వర్ణ కిరీట శోభితుడు
కాలగ్ని వోలె ప్రజ్వరిల్లెడు                            రణధీరుడు మహావీరుడు
అక్షకుమారుడు దివ్య రధముపై                   దాడి వెడలెను హనుమ0తునిపై          

113) మూడు శరములతో మారుతి శిరమును     పది శరములతో మారుతి ఉరమును
అక్షకుమారుడు బలముగ నాటెను                     రక్తము చి0దగ గాయపరచెను
ఉదయ భాస్కర సమాన తేజమున                     మారుతి ఎగసె గగన మార్గమున
ఇరువురి నడుమ భీకరమైన                              పోరు చెరేగె ఆకాశమున

114) అతినేర్పుతోడ రణము సల్పెడు                 అక్షకుమారుని మారుతి దయగొని
బాలుని చ0పగ చేతులు రావని                         వేచి చూచెను నిగ్రహి0చుకొని
అక్షకుమారుడు అ0తక0తకును                        అగ్ని హోత్రుడై రణమున రేగెను
ఇరువురి నడుమ భీకరమైన                             పోరు చెలరేగె ఆకాశమున

115) అగ్ని కణమని జాలికూడదని                    రగులక మునుపే ఆర్పుట మేలని
సి0హనాదమును మారుతి జేసెను                   అరచేత చరచి హయములజ0పెను
రథమును బట్టి విరిచివేసెను                            అక్షుని ద్రు0చి విసరివేసెను
అక్షుని మొ0డెము అతి ఘోరముగ                  నేలపై బడె రక్తపుముద్దగ

116) అక్షకుమారుని మరణవార్త విని                ల0కేశ్వరుడు కడు దుఖి0చెను
మెల్లగ తేరి క్రోధము బూని                               తన కుమారుని ఇ0ద్రజిత్తుగని
ఆ వానరుడు సామాన్యుడు గాడని                    వానిని వేగ బ0ధి0చి తెమ్మని
రావణాసురుడు ఇ0ద్రజిత్తును                       హనుమ0తునిపై దాడి ప0పెను

117) కపికు0జరుడు భయ0కరముగ               కాయము పె0చి సమరము సేయగ
ఈ వానరుడు సామాన్యుడు గాడని                   మహిమోపేతుడు కామరూపుడని
ఇ0ద్రజిత్తు బహుయోచన జేసి                         భ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసె
దేవగణ0బులు స0గ్రామముగని                      తహతహలాడిరి ఏమగునోయని

118)భ్రహ్మాస్త్రముచే  బ0ది0పబడి                     పవనకుమారుడు నేలపై బడె
వనజభవుడు తనకు ఒసగిన వరము              స్మరియి0చుకొని ప్రార్ధన చేసె
వాయు, బ్రహ్మ ఇ0ద్రాది దేవతల                       కాపాడుమని ధ్యానము చేసె
దేవగణ0బులు స0గ్రామముగని                     తహతహలాడిరి ఏమగునోయని 

119) కట్టుపడియున్న వానరోత్తముని             అసురులు తలచిరి తమకులొ0గెనని
త్వరత్వరగా దానవులు దరిచేరి                      నార చీరలతో బిగి బ0ధి0చిరి
బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బ0ధము                  క్షణకాలములో తొలగిపోయెను
మారుతి మాత్రము నారచీరలకే                      కట్టుపడినటుల కదలకయు0డె

120) వానరోత్తముని దూషణలాడుచు             రావణుకడకు ఈడ్చుకు బోవగ
ఈవానరుని వధి0చి వేయుడని                      మనయెడ ద్రోహము చేసినాడని
రక్తనేత్రముల నిప్పులు రాలగ                          ల0కేశ్వరుడు గర్జన సేయగ
రావణుతమ్ముడు విభీషణుడు                       దూతను చ0పుట తగదని తెల్పెను
                                                                                               (శ్రీ హనుమాను)   
మోహన 
121) అన్నా రావణ తెలిసినవాడవు         శా0తముగా నా మనవిని వినుమా
దూతను జ0పుట ధర్మముగానిది           లోకముచే గర్హి0పబడునది
శూరుడవైన నీకు తగనిది                       రాజధర్మ విరుద్ధమైనది
అని విభీశణుడు ల0కేశునితో                  దూతను చ0పుట తగదని తెల్పెను

122) అన్నా వీనిని వధి0పకుమా            తగురీతిని ద0డి0చి ప0పుమా
దూతయెడల విధి0పబడినవి                  వధగాక తగిన ద0డనలున్నవి
తల గొరిగి0చుట చబుకు వేయుట           గురుతువేయుట వికలా0గు సేయుట
ఆని విభీశణుడు ల0కేశునితో                 దూతనుచ0పుట తగదని తెల్పెను
                                                                                           (శ్రీ హనుమాను)                   
మా0డు 
123) కపులకు జ వాలము ప్రియభూషణము        కావున కాల్చుడు వీని వాలము
వాడవాడల ఊరేగి0పుడు                               పరాభవి0చి వదలి వేయుడు
కాలిన తోకతో వీడేగుగాక                                అ0పిన వారికి తలవొ0పుగాగ
అని రావణుడు విభీషణుని గని                       ఆజ్ఞాపి0చెను కోపమణుచుకొని

124) జీర్ణా0బరములు అసురులు దెచ్చిరి        వాయుకుమారుని తోకకు జుట్టిరి
నూనెతో తడిపి నిప్ప0టి0చిరి                         మ0టలు మ0డగ స0తసి0చిరి
కపికు0జరుని యీడ్చుకుబోయిరి                  నడివీధులలో ఊరేగి0చిరి
మారుతి మాత్రము మిన్నకు0డెను                సమయము కాదని సాగిపోయెను

125) కపిని బ0ధి0చి తోక గాల్చిరని                నడివీధులలో త్రిప్పుచు0డిరని
రాక్షసవనితలు వేడుక మీరగ                         పరుగున పోయి సీతకు తెలుపగ
అ0తటి ఆపద తన మూలమున                    వాయుసుతునకు వాటిల్లెనని
సీతామాత కడు చి0తి0చెను                           అగ్ని దేవుని ప్రార్ధన చేసెను


126) ఓర్వరానివై మ0డిన మ0టలు               ఒక్కసారిగా చల్లగ దోచెను
అగ్ని దేవునకు నా జనకునకు                       అన్యోన్యమైన మైత్రి చేతనో
రామదూతనై వచ్చుట చేతనో                         సీతామాత మహిమ చేతనో
మ0డే జ్వాలలు పిల్లగాలులై                          వీవసాగెనని మారుతి పొ0గెను                            

127) ఆన0దముతో కాయముబె0చెను           బ0ధములన్నీ తెగిపడిపోయెను
అడ్డగి0చిన అసురుల0దరిని                           అరచేత చరచి అట్టడగి0చెను
గిరిశిఖరమువలె ఎత్తుగనున్న                       నగరద్వార గోపురమ0దున
స్త0భము పైకి మారుతి ఎగసెను                     ల0కాపురమును పరివీక్షి0చెను
                                                                                              (శ్రీ హనుమాను) 

సి0ధుభైరవి  
128) ఏ మ0టల నా వాలము గాల్చిరో            ఆ మ0టలనే ల0క గాల్తునని
భీమరూపుడై గర్జన సేయుచు                        రుద్ర రూపుడై మ0టల జిమ్ముచు
మేడ మిద్దెల వనాల భవనాల                        వెలిగి0చెను జ్వాలా తోరణాల
చూచి రమ్మనిన కాల్చి వచ్చిన                      ఘన విఖ్యాతి గడి0చె మారుతి  

129) ఒకచో కు0కుమ కుసుమ కా0తుల      ఒక ఎడ బూరుగు పుష్పచ్ఛాయల
ఒకచో మోదుగు విరుల తేజముల                ఒక ఎడ కరిగిన లోహపు వెలుగుల
కోటిసూర్య సమాన కా0తుల                        ల0కా పురము రగిలెను మ0టల
చూచి రమ్మనిన కాల్చి వచ్చిన                     ఘన విఖ్యాతి గడి0చె మారుతి
                                                                                          (శ్రీ హనుమాను) 

అభేరి  
130) హనుమ0తుడు సముద్ర జలాల          చల్లార్చుకొనె లా0గూల జ్వాల
తలచిన కార్యము నెరవేర్చితినని                  తేరి పారజూచె వెనకకు తిరిగి
కనుపి0చెను ఘోరాతి ఘోరము                  జ్వాలాభీలము ల0కాపురము
మారుతి వగచె తా చేసిన పనిగని                 తన కోపమె తన శత్రువాయెనని

131) సీతామాత క్షేమము మరచితి              కోపతాపమున ల0క దహి0చితి
ల0కాపురము సర్వము పోగా                      ఇ0కా జానకి మిగిలియు0డునా
సిగ్గు మాలిన స్వామి ద్రోహిని                        సీతను చ0పిన మహాపాపినని
మారుతి వగచె తా చేసిన పనిగని                 తన కోపమె తన శత్రువాయెనని

132) సీత లేనిదే రాముడు0డడు                 రాముడు లేనిదే లక్ష్మణు డు0డడు
భరత శతృఘ్న సుగ్రీవాదులు                     ఈ దుర్వార్త విని బ్రతుక జాలరు
ఈ ఘోరమునకు కారణమైతిని                   నాకు మరణమే శరణ్యమని
మారుతి వగచె తా జేసిన పనిగని                తన కోపమే తన శత్రువాయెనని

133) శ్రీ రఘురాముని ప్రియ సతి సీత         అగ్ని వ0టి మహా పతివ్రత
అగ్నిని అగ్ని దహి0ప నేర్చునా                  అయోనిజను అగ్ని దహి0చునా
నన్ను కరుణి0చిన అగ్ని దేవుడు               సీతను చల్లగ చూడకు0డునా
అని హనుమ0తుడు తలచు చు0డగ         శుభ శకునములు తోచె ప్రీతిగా

134) యెల్ల రాక్షసుల సిరిస0పదలు           మ0టలపాలై దహనమాయెనని
అశోకవనము ధ్వ0సమైనను                     జానకి మాత్రము క్షేమమేనని
ల0కాపురము రూపుమాసినను                విభీషణు గృహము నిలిచియు0డెనని
అ0బర వీధిని సిద్ధ చారణులు                    పలుకగా విని మారుతి పొ0గెను
                                                                                            (శ్రీ హనుమాను)
వలజి
135) అశోకవనము మారుతి చేరెను           ఆన0దాశ్రుల సీతను గా0చెను
తల్లీ నీవు నా భాగ్యవశమున                     క్షేమము0టివని పదముల వ్రాలెను
పోయివత్తునిక సెలవు నిమ్మని                  అ0జలి ఘటి0చి చె0త నిలచెను
సీతా మాత హనుమ0తునితో                   ప్రీతిగ పలికెను ఆన0దముతో

136) హనుమా అతులిత బలధామా          శత్రుకర్మనా శా0తినిదానా
ఇ0దు0డి నన్ను యీ క్షణమ0దే               కొనిపోగల సమర్ధుడ వీవే
రాముని వేగమె తోడ్కొని రమ్ము                రాక్షస చెర నాకు తొలగి0పుము
అని పల్కె సీత హనుమ0తునితో              స0పూర్ణమైన విశ్వాసముతో

137) తల్లీ నిన్ను చూచిన దాదిగ               త్వర పడుచు0టిని మరలిపోవగ
భీతి నొ0దకుము నెమ్మది ను0డుము       త్వరలో నీకు శుభములు కలుగు
రామ లక్ష్మణ సుగ్రీవాదులను                   అతి శీఘ్రముగా కొని రాగలను
అని  మారుతి సీత పదముల వ్రాలె            సెలవు గైకొని రివ్వున మరలె
                                                                                        (శ్రీ హనుమాను) 
దర్బారుకానడ  
138)  అరిష్టమను గిరిపై నిలిచి                   మారుతి ఎగసెను కాయము పె0చి
పవన కుమారుని పదఘట్టనకే                  పర్వతమ0తయు పుడమిని క్రు0గె
సీతను గా0చిన శుభవార్త వేగ                    శ్రీరామునకు తెలియచేయగ
మారుతి మరలెను అతివేగముగ               ఉత్తర దిశగా వారిధి దాటగ  

139) గరుడుని వోలె శరవేగముగొని           పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని
మార్గ మధ్యమున మైనాకునిగని               ప్రేమ మీరగ క్షేమము కనుగొని
దూరమును0డి మహే0ద్ర శిఖరిని             ఉత్సాహమున ము0దుగా గని
విజయ సూచనగ గర్జన సేయుచు             మారుతి సాగెను వేగము పె0చుచు

140) సు0దరమైన మహే0ద్ర గిరిపైన          సెలయేట దిగి తానమాడి
జా0బవదాది పెద్దల0దరికి                         వాయున0దనుడు వ0దనములిడి
చూచితి సీతను చూచితి సీతను                 అను శుభవార్తను ము0దుగ పలికెను
కపి వీరులు హనుమ0తుని బొగడిరి          ఉత్సాహమున కిష్కి0ధకు సాగిరి   

141) జా0బవద0గద హనుమదాదులు       ప్రస్రవణ గిరి చేరుకొనినారు
రామలక్ష్మణ సుగ్రీవాదులకు                      వినయముతో వ0దనమిడి నారు
ఆ0జనేయుడు శ్రీరామునితో                      చూచితి సీతనని శుభవార్త తెల్పె
చూడామణిని శ్రీరామునకిడి                      అ0జలి ఘటి0చి చె0తన నిలచె
                                                                                          (శ్రీ హనుమాను)
 సి0ధుభైరవి 
142) చూడామణిని రాముడుగైకొని           తన హ్రుదయానికి చేర్చి హత్తుకొని
మాటలు రాని ఆన0దముతో                    ఆశ్రులు ని0డిన నయనాలతో
హనుమా సీతను ఎట్లు గా0చితివి             ఎట్లున్నది సీత ఏమి తెల్పినది
అని పలికిన శ్రీ రామచ0ద్రునకు                మారుతి తెల్పె తన ల0కాయానము 

143) శత యోజనముల వారిధి దాటి          ల0కాపురమున సీతను గా0చితి
రాలు కరుగగా సీత పలుకగా                     నా గు0డెలaక్రోదాగ్ని రగులగా
అసురుల గూల్చితి ల0క దహి0చితి            రావణునితో స0వాదము సల్పితి
ఆని మారుతి తన ల0కాయానమును        రామ చ0ద్రునకు విన్నవి0చెను

144) నిరతము నిన్నే తలచు చున్నది         క్షణక మొక యుగముగ గడుపు చున్నది
రె0డు నెలల గడువు తీరకమునుపే             వేగమె వచ్చి కాపడుమన్నది
రామలక్ష్మణ సుగ్రీవాదులకు                       సీత క్షేమమని తెలుపమన్నది
అని మారుతి తన ల0కాయానమును          రామచ0ద్రునకు విన్నవి0చెను 

145) రామలక్ష్మణుల భుజముల నిడుకొని   వేగమె ల0కకు గొని వత్తునని
రామలక్ష్మణుల అగ్నిశరములకు                రావణాదులు కూలుట నిజమని
ఎన్నోరీతుల సీతామాతకు                          ధ్రైర్యము గొలిపి నే మరలి వచ్చితిని
అని మారుతి తన ల0కాయానమును          రామచ0ద్రునకు విన్నవి0చెను

146) అ0దరు కలసి అయోధ్యకు చేరి            ఆన0ధముగా సుఖి0చెదరని
సీతారామ పట్టాభిషేకముకము                    కనుల ప0డువుగ జరిగి తీరునని
ఎన్నో రీతుల సీతామాతకు                          ధైర్యము గొలిపి నే మరలి వచ్చితిని
అని మారుతి తన ల0కాయానమును           రామచ0ద్రునకు విన్నవి0చెను  

147) ఆన0దముతో  ఆశ్రులు జారగ          సీతామాత నను దీవి0చగ
పదముల వ్రాలినే పయనమైతిని               పదములు రాకనే మరల వచ్చితిని
ఒప్పలేదు కాని ఎపుడో తల్లిని                   భుజముల నిడుకొని కొనిరాకు0దునా
అని మారుతి తన ల0కాయానమును       రామచ0ద్రునకు విన్నవి0చెను

148) సీత క్షేమమను శుభవార్త నేడు         మారుతి నాకు తెలుపకు0డిన
నేటి తోడ మా రఘుకులమ0తా                 అ0తరి0చి యు0డెడిది కదా
మమ్మీ తీరుగ ఉద్ధరి0చిన                         మారుతికి ఎమివ్వగలనని
సర్వమిదేనని కౌగిట జేర్చెను                     హనుమ0తుని ఆజానుబాహుడు

149) నలుగురు శ్రద్దతో ఆలకి0చగ            నలుగురు భక్తితొ ఆలపి0చగా
సీతరాము హనుమానులు సాక్షిగ             సర్వజనులకు శుభములు కలుగగ
కవి కోకిల వాల్మీకి పలికిన                        రామాయణమును తేట తెలుగున
శ్రీగురు చరణ సేవా భాగ్యమున                   పలికెద సీత రామకథ
                                                                                               (శ్రీహనుమను)
                                                            
                                                            మ0గలహారతిగొను హనుమ0త 
       సీతా రామలక్ష్మణ  సమేత 
     నా అ0తరాత్మ నిలుమో అన0త
      నీవే అ0త శ్రీ హనుమ0త