About Me

Over the last few decades I've spent a number of hours cooking for my family of 5. My husband is a retired bank Manager and my 3 boys are IIT graduates. Now I'm sharing my knowledge and thoughts to the world through this site. Whether you are a busy mom or a student learning to cook, you will find this blog helpful for cooking simple and easy to make food for yourself and the whole family. Hope you enjoy my recipe blog! I also love listening to devotional songs. Please browse through my devotional blogs to know more about them. I am always looking for ways to improve my blogs. Please leave your comments. If you like to see recipe of any particular dish or lyrics of a devotional song, please also let me know. Thanks for reading my blog.
Showing posts with label శ్రీలక్ష్మి తెలుగు భక్తి పేజీలు. Show all posts
Showing posts with label శ్రీలక్ష్మి తెలుగు భక్తి పేజీలు. Show all posts

Wednesday, 21 September 2011

ధనదాదేవి స్తోత్రం (Dhanadadevi Stotram)

ధనదాదేవి స్తోత్రం
నమః సర్వ స్వరూపేచ సమః కళ్యాణదాయని
మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతేలక్ష్మి
 
మహా భోగప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే

బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి
దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే

ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే
శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే


విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణి
మహాసత్వ గుణే నంతే ధనదాయే నమోస్తుతే

శివరూపే శోవానందే కారణానంద విగ్రహే
విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతే

పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే
సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే

ధనసంపదనిచ్చే మంత్రం:
కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలా స్థితా తాందేవం
తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః
(ఈ మంత్రాన్ని నిష్టగా రోజుకు 108 పర్యాయాల చొప్పున 21రోజులు జపించాలి)

శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ (Srilakshmee Stotram)

శ్రీ లక్ష్మీ స్తోత్రమ్
(Srilakshmee Stotram)


జయ పద్మవిశాలాక్షి జయ త్వం శ్రీ పతిప్రియే
జయమారత్మహాలక్ష్మి సంసారర్ణవతారణి
మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి
హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే
పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే
సర్వభూతహితార్దాయ వసువృష్టిం సదా కురు
జగన్మాతర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే
దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే
నమః క్షీరార్ణవసుతే నమస్త్రైలోక్యధారిణి
వసువృష్టే నమస్తుభ్యం రక్షమాం శరణాగతమ్
రక్షత్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే
దరిద్రం త్రాహి మాం లక్ష్మీం కృపాం కురు మమోపరి
నమస్త్రైలోక్యజనని నమస్త్రైలోక్య పావని
బ్రహ్మాదయో నమస్యన్తి త్వాం జగదానన్దదాయిని
విష్ణుప్రియే నమస్తుభ్యం సమృద్ధిం కురు మే సదా
అబ్జవాసే నమస్తుభ్యం చపలాయైయ నమోనమః
నమః ప్రద్యుమ్నజసని మాతస్తుభ్యం నమో నమః
పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతమ్
శరణ్యే త్వాం ప్రపన్నో స్మి కమలే కమలాలయే
త్రాహిత్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే
పాండిత్యం శోభతే నైవ నమః శోభన్తి గుణా నరే
శీలత్వం నైవ శోభేతే మహాలక్ష్మి త్వయా వినా
తావద్విరాజతే రూపం తావచ్ఛీలం విరాజతే
తావద్గుణా నరాణాం చ యావల్లక్ష్మీ: ప్రసీదతి
లక్ష్మి త్వయాలం కృతమానవా యే పాపైర్విముక్తా
నృపలోకమాన్యా గునైర్విహీనా గుణినో భవన్తి
దుశ్శీలినః శీలవతాం వరిష్టా లక్ష్మీర్భూషయతే రూపం
లక్ష్మీ ర్భూషయతే కులం లక్ష్మీర్భూషయతే విద్యాం
సర్వా లక్ష్మీర్విశిష్యతే లక్ష్మి త్వద్గుణకీర్తనేన కమలా భూర్యాత్యలం
జిహ్వతాం రుద్రాద్యా రవిచన్ద్రదేవపతయో వక్తుం చ నైవ క్షమాః
అస్మాభిస్తవ రుపలక్షణ గుణాన్వక్తుం కథ శక్యతే
మాతర్మాం పరిపాహివిశ్వజననీకృత్వామమేష్టం ధ్రువమ్
దీనార్తిభీతం భవతాపపీడితం ధనైర్విహీనం తవ పార్శ్వ మాగతం
కృపానిధిత్వాన్మమ లక్ష్మి సత్వరం ధనప్రదానాద్దననాయకం కురు
మాం విలోక్య జననీ హరిప్రియే నిర్ధనం తవ సమిపమాగతం
దేహిమే ఘుడితి లక్ష్మి కరాగ్రం వస్త్రం కాంచన వరాన్న మద్భుతమ్
త్వమేన జననీ లక్ష్మి పితా లక్ష్మి త్వమేవ చ భ్రాతా త్వం చ
సఖా లక్ష్మి విద్యాలక్ష్మి త్వమేవ చ త్రాహి త్రాహి మహాలక్ష్మి
త్రాహి త్రాహి సురేశ్వరి త్రాహి త్రాహి జగన్మాత దారిద్ర్యాత్త్రాహి వేగతః
నమస్తుభ్యం జగద్ధాత్రి నమస్తుభ్యం నమో నమః
ధర్మధారే నమస్తుభ్యం నమస్సమ్పత్తిదాయిని దారిద్ర్యార్ణవమగ్నో
హామ నిమగ్నో హం రసాతలే మజ్జన్తం మాం కరేధృతాం
తూద్ధర త్వం ర మే ధ్రుతం కిం లక్ష్మి బహునోక్తేన జల్పితేన
పునః పునః అన్యన్మే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే
ఏతచ్చ్రుత్వాగస్తివాక్యం హృష్యమాణా హరిప్రియా ఉవాచ
మధురాం వాణీ తుష్టాహం తవ సర్వదా
శ్రీలక్ష్మీ ఉవాచ:
యత్త్యయోక్తమిదం స్తోత్రం యః పఠిష్యతి మానవః
శ్రునోతి చ మహాభాగ తస్యాహం వశవర్తినీ
నిత్యం పఠతి యో భక్త్యాం త్వ లక్ష్మీ స్తస్య నశ్యతి
ఋణం చ నష్యతే తీవ్రం వియోగం నైవ పశ్యతి
యః పఠేత్ర్పాతరుత్దాయ శ్రద్ధాభక్తి సమన్విత:
గృహే తస్య సదా తుష్టా నిత్యం శ్రీ పతినా సహ
సుఖ సౌభాగ్యసంపన్నో మనస్వీ బుద్ధిమాన్భవేత్
పుత్రవాన్గుణవాన్శ్రేష్టో భోగభోక్తా చ మానవ
ఇదం స్తోత్రం మహాపుణ్యం లక్ష్మ్యా గస్తిప్రకీర్తితం
విష్ణుప్రసాద జననం చతుర్వర్గఫలప్రదం
రాజద్వారే జయశ్త్చైవ పరాజయః
భూతప్రేతపిశాచానాం వ్యాఘ్రాణాం నమః భయం తథా
నశస్త్రానలతో యౌఘాద్భయం తస్య ప్రజాయతే
దుర్ర్వత్తానాం చ పాపానాం బహుహానికరం పరమ్
మన్దురాకరిశాలాసు గవాం గోష్టే సమాహితః
పఠేత్తద్దోషశాన్త్యర్ధం మహాపాతక నాశనం
సర్వసౌఖ్యకరం న్రూణా మాయురారోగ్యం తథా
ఆగస్తిమునాప్రోక్తం ప్రజానాం హితకామ్యయా
ఇతి అగస్త్య విరచితం శ్రీ లక్ష్మీ స్తోత్రమ్

ధనలక్ష్మీ స్తోత్రం

ధనలక్ష్మీ స్తోత్రం
(Dhanalakshmee Stotram)

సువర్ణవృద్ధి కురుమే గృహే శ్రీ: కల్యాణ వృద్ధి కురుమే గృహే
సౌభాగ్య్ర్వద్ధింకురుమే గృహేశ్రః శ్రీ శాంఘ్రి భక్తిం హరిధ్యాన దాస్యం
ప్రసన్న మంత్రార్ధ దృడైకనిష్టాణ గురో: స్మ్రతిం నిర్మల బోధ బుద్ధిం
ప్రదేహిమేదేహి పరంపదం శ్రీ: పృద్వీంపతిత్వం పురుషోత్తమత్వం
విభూతివాసం వివిధార్ధసిద్ధం సంపూర్ణసిద్ధం బహువర్షభోగం
ప్రదేహిమే భార్గవి జన్మజన్మని
య ఏకభుక్తోన్వహ మేకవర్షం విశుద్ధధీ: సప్తవివారజాపీ
సమంద సౌభాగ్యసి రమాకటాక్షాత్ భవేత్ సహస్రాక్ష శతాధిక శ్రీ:

శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళి

శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళి
(Sri Mahalakshmee Chaturvimsati Namavali)

శ్రీ వేంకటేశ మహిషీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం శ్రీ వేంకటేశ మహిషీ మహాలక్ష్మి
చతుర్వింశతి నామభి: శ్రీ వెంకటేశ మహిషీ మహా లక్ష్మిఅర్చన కరిష్యే
అస్య శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామ మంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టప్ చంధం!
శ్రీ మహాలక్ష్మీ దేవతాః శ్రీ వెంకటేశ మహిషీ శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్ధే జపే వినియోగః
ధ్యానం
ఈశానం జగతో స్య వెంకట పతే ర్విష్టో: పరాం ప్రేయసీం
తద్వక్షస్స్థల నిత్య వాసరసికాం తత్ కాంతి సంవర్ధినీమ్
పద్మాలంకృతపాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం
ఓం శ్రియై నమః       ఓం లోకధాత్రై నమః      ఓం బ్రహ్మమాత్రే నమః      ఓం పద్మనేత్రాయ నమః
ఓం పద్మముఖ్యై నమః        ఓం ప్రసంనముఖ నమః        ఓం పద్మాయై నమః        ఓం పద్మకాంత్యై నమః
ఓం పద్మకాంత్యై నమః       ఓం ప్రసన్నముఖ పద్మాయై నమః        ఓం బోల్వ వనస్థాయై నమః  
ఓం విష్ణు పత్నై నమః        ఓం విచిత్ర క్షౌమధారిన్యై నమః        ఓంపృథు శ్రోన్యై నమః     
ఓం పక్వ బిల్వ ఫలా పీనతుంగ స్తన్యై నమః      ఓం సురక్త పద్మ పత్రాభ నమః       ఓం కరపాదతలాయై నమః
ఓం శుభాయ నమః          ఓం సరత్నాంగత కేయూర నమః         ఓం కాంచీనూపురశోభితాయై నమః
ఓంయక్ష కర్దమ సంలిప్త సర్వాంగాయై నమః         ఓం మంగళ్యాభరనై శ్చితైర్ముక్తాహారై ర్విభూషితాయై నమః
ఓం తాటకై రవతం సైశ్చశోభమాన ముఖాంబుజాయై నమః          ఓం పద్మ హస్తాయై నమః
ఓం హరివల్లభాయై నమః        ఓం ఋగ్యజుస్సామరూపాయై నమః        ఓం విద్యాయై నమః      ఓం అబ్దిజాయై నమః      
ఓం ఏవం చతుర్వింశతి నామభి: బిల్వపత్రై లక్ష్మ్యర్చనం కుర్యత్ తేన సర్వాభీష్ట సిద్ధిర్భవతు
ఇతి చతుర్వింశ తి నామావళి

కనకధారాస్తవం

ఆ స్తోత్రమే ఎంతో మహిమగల ఈ కనకధారా స్తోత్రం ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించేవారికి, లక్ష్మీదేవి ప్రసన్నురాలై సర్వాభిష్టాలను సిద్ధింపచేస్తుంది.


అంగ హరే: పులక భూషమాశ్రయంతీ
భ్రుంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్
అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవాతాయా
మొగ్గలతో నిండి వున్న చీకటి కానుగ(చెట్టు)కు ఆడ తుమ్మెదలు ఆభరణాలైనట్టు, పులకాంకురాలతో వున్న శ్రీహరి శరీరాన్ని ఆశ్రహించినదీ, సకలైశ్వర్యాలకు స్తానమైనదీ అయిన లక్ష్మీదేవి యొక్క చక్కని క్రీగంటి చూపు నాకు శభాలనే ప్రసాదించుగాక!

ముగ్ధా ముహుర్విదధతీ పదనే మురారే:
ప్రేమత్రపా ప్రణిహితాని గతగతాని,
మాలా దృశో: మధుకరీన మహోత్పలేయా
సామే శ్రియం దిశతు సాగర సంభవాయా
పెద్ద నల్ల కలువపై వుండే తుమ్మెదలా శ్రీ హరి ముఖంపై. ప్రేమ సిగ్గులతో ముందు వెనుకలకు ప్రసరిస్తున్న, సముద్ర తనయ లక్ష్మీ యొక్క కృపాకటాక్షము నాకు సంపదను అనుగ్రహించుగాక!

విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్ష
మానందహేతు రాధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయి క్షనమీక్షణణార్ద
మిందీవరోదర సహోదర మిందిరాయా:
దేవేంద్ర పదవిని ఈయగలదీ, శ్రీ మహా విష్ణువు సంతోషానికి కారనమైనదీ. నల్లకలువలను పోలునదీ అయిన లక్ష్మీదేవి కటాక్షం కొంచెం నాపై ఉండుగాక!

అమీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద
మానందకంద మనిమేష మనంగతంత్రమ్
అకేరక స్థిత కనీనిక పక్ష్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయా
నిమీలిత నేత్రుడై, ఆనంద కారణుడైన శ్రీ మహావిష్ణువుని సంతోషములతో చూడడం వలన రెప్పపాటు లేనిదీ, కామ వశమైనదీ కుంచితమైన కనుపాపలతో రెప్పలతో శోభిల్లునదీ అయిన శ్రీ లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగు గాక!

కాలంబుదాలి లలితోరసి కైటభారే:
ధారా ధరే స్పురతి యాతటిదంగనేవ
మాతస్సమస్తజగతాం మహానీయ మూర్తి:
భద్రాణి మే దిశతు భార్గవనందనాయా
కారుమబ్బు మీద మెరుపుతీగలా, నీల మేఘ శ్యాముడైన నారాయణుని వక్షస్థలంపై ప్రకాశిస్తున్న ముల్లోకాల తల్లి భార్గవనందన అయిన లక్ష్మీదేవి నాకు శుభాములనిచ్చుగాక!

బాహ్యంతరే మరజితః శ్రిత కౌస్తుభే యా
హారావలీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
భగవంతుడైన నారాయణునికి కామప్రదయై, అయన హృదయమందున్న కౌస్తుభమున ఇంద్రనీల మణిమయమైన హారావళివలె ప్రకాశిస్తున్న, కమలాలయ అయిన లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభములను చేకూర్చుగాక

ప్రాప్తం పద ప్రథమతః ఖాలు యత్ర్పభావత్
మాంగల్యభాజి మధుమాథిని మన్మదేన
మయ్యాపతేత్తదిహ మంథరామీక్షణార్ధం
మందాలసం చ మకరాలయ కన్యకాయా!
ఏ క్రీగంటి ప్రభావంతో మన్మధుడు మధుసూదనునియందు ముఖ్యస్థానమునాక్రమించేనో అట్టి క్షీరాబ్ధి కన్య అయిన లక్ష్మీ యొక్క చూపు నా యందు ప్రసరించుగాక!

దద్యాద్దయానుపనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించిన విహంగశిశౌ విషణ్ణేం!
దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణప్రణయినీ నయనంబువాహః
శ్రీమన్నారాయణుని దేవియైన లక్ష్మిదేవి దృష్టి అనే మేఘం, దయ అనే వాయువుతో ప్రేరితమై, నాయందు చాలాకాలంగా వున్న దుష్కర్మ అనే తాపాన్ని తొలగించి, పేదవాడినన్న విచారంతో చాతకపు పక్షి వలెనున్న నాపై ధనవర్ష ధారను కురిపించుగాక!

ఇష్టా విశిష్టమతయోపి మయా దయార్ద్ర
దృష్టా స్త్రివిష్టస పదం సులభం భజంతే!
దృషి: ప్రవృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టి కృషీష్ట మమ పుష్కర విష్టరాయా:!
పద్మాసని లక్ష్మీదేవి దయార్ద్ర దృష్టివలెనే విశిష్టులైనవారు సులభంగా ఇంద్రపదవిని పొందుతున్నారు. వికసించిన పద్మంలా ప్రకాశించే ఆ దృష్టి. కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక!

గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాంకభరీతి శశిశేఖర వల్లభేతి!
సృష్టిస్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
త తస్యై నమస్త్రి భువనైక గురోస్తరున్యై!
వాగ్దేవ (సరస్వతి) అనీ, విష్ణు సుందరి అనీ, శాంకభారీ అనీ, శాశిరేఖవల్లభా అనీ పేరు పొందినదీ, సృష్టి, స్థితి లయముల గావించునదీ త్రిభువనాలకు గుర్వైన విష్ణువు యొక్క పట్టపురాణి అయిన లక్ష్మిదేవికి నమస్కారము.

శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రాత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్యై నమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై!
పుణ్యకార్యాల ఫలము నొసగి శృతిరూపిణి, సౌందర్యగుణ సముద్ర అయిన రతి రూపిణి, పద్మనివాసిని అయిన శక్తి రూపిణి, నారాయణుని వల్లభా లక్ష్మిదేవికి నమస్కారమ్.!
నమోస్తు నాళీకవిబావనాయై
నమోస్తు దుగ్దోదధిజన్మ భూమ్మ్యై
నమోస్తు సోమామృతసోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై
పద్మాన్ని బోలిన ముఖముగలదీ క్షీరసాగర తనయ, చంద్రునకు అమృతమునకు తోబుట్టువైనదీ, నారాయణపత్ని అయిన లక్ష్మిదేవికి నమస్కారము.

నమోస్తు హేమంబుజపీఠికాయై
నమోస్తు భూమండలనాయకయై
నమోస్తు దేవాదిదయాపరాయై
నమోస్తు శార్ఘాయుధ వల్లభాయై
బంగారు పద్యం ఆసనంగా కలది. భూమండల నాయిక దేవతలను దయచూచునది, విష్ణుపత్నియైన లక్ష్మిదేవికి నమస్కారము. నమోస్తు దేవ్యైభ్రుగునందనాయై నమోస్తు విష్ణోరరురస్థితాయై నమోస్తు లక్ష్మ్తే కమలాలయాయై నమోస్తు దామోదర వల్లబాయై! భ్రుగుమహర్షి పుత్రిక, విష్ణు వక్షస్థల నివాసిని పద్మాలయ, విష్ణుప్రియ లక్ష్మీదేవి నమస్కారం

నమోస్తు కాంతై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై!
నమోస్తు దేవాదిభిరర్చితాయై
నమోస్తు నందత్మాజ వల్లభాయై
పద్మములవంటి కన్నులగలది, దేదీప్యమానమైనది, లోకాలకు తల్లి, దేవతల పూజలందుకోనునది, నందాత్మజుని ప్రియురాలు శ్రీమహాలక్ష్మీకి నమస్కారం.
సంపత్కరాణి సకలేంద్రియనందనాని
సామ్రాజ్యదాన నిరతాని సరోరుహక్షి
త్వద్వందనాని దురిరాహరనోద్యతాని
మామేవ మాతరవిశం కలయంతు మాన్యే!
పద్మాక్షి! నిన్ను గూర్చి చేసిన నమస్కారం సంపదను కలిగిస్తాయి. సకలేంద్రియాలకు సంతోషాన్ని కలిగిస్తాయి. చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తాయి. పాపాలను నశింపచేస్తాయి. ఓ తల్లి! ఎల్లప్పుడు నన్ను అనుగ్రహించుగాక!

యత్కటాక్ష సముపాసనా విధి:
సేవకన్య సకలార్ధసంపదః
సంతనోతి వచనాంగ మానసై:
త్వాం మురారి హృదయేశ్వరీం భజే
ఏ దేవి కటాక్ష వీక్షణంతో దేవకులకు సకలార్థ సంపదలు లభిస్తాయో, అట్టి మురారి హృదయేశ్వరి లక్ష్మీ దేవిని, మనోవాక్కాయమూలతో త్రికరణ శుద్ధిగా సేవించేదను.

సరసిజనయనే సరోజహస్తే
ధవళమాంశుక గంధమాల్యశోభే!
భగవతి హరివిల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతకరి ప్రసీదమహ్యామ్!
పద్మాక్షీ! చేతియందు పద్మము ధరించి, తెల్లని వస్త్రంతో, గంధ పుష్పమాలికాదులతో ప్రకాశించుచున్న భగవతి! విష్ణుప్రియా! మనోజ్ఞురాలా! ముల్లోకాములకు సంపదను ప్రసాదించు మాతా! నన్ననుగ్రహించు.

దిగ్ఘస్తిభి: కనక కంభముఖావసృష్ట
స్వర్వాహిని విమలచారుజల్లాప్లుతాంగిమ్
ప్రాతర్నమామి జగతాం జననీం, అశేష
లోకదినాథ గృహిణీం అమృతాబ్ది పుత్రీమ్!
దిగ్గజాలు బంగారు కుంభాలతో తెచ్చిన నిర్మలమై ఆకాశ జలాలతో అభిషేకించబడిన శరీరము గల లోక జనానికి, విశ్వా ప్రభువైన విష్ణువు యొక్క గృహిణికి, క్షీరసాగర పుత్రికయైన మహాలక్ష్మికి ఉదయమునే నమస్కరించుచున్నాము
.
కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణా పూరతరంగైరపాంగై:
అవలోకయ మామకించనానాం
ప్రథమ పాత్రమక్రుతిమం దయాయాః
విష్ణువల్లభురాలివైన మహాలక్ష్మి!దరిద్రులలో ప్రథముడును, నీ దయకు తగిన పాత్రమును అగు నన్ను నీ కరుణా కటాక్షంతో చూడు.

ఫలశృతి:
స్తువంతి యే స్తుతిభిరమూభిరస్వాహం
త్రాయిమయిం త్రిభువన మాతరం రామమ్!
గుణాధికా గురుతర భాగ్యభాగినో
భవంతి తే భువి బుధభావితాశయాః!
వేదరూపిణి, త్రిలోకమాత అయిన శ్రీ మహాలక్ష్మీని ప్రతిదినం ఈ స్తోత్రంతో స్తుతిస్తారో వారు విద్యాంసులచే భావించబడే ఉన్నతులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలురావుతున్నారు.
సువర్ణధారా స్తోత్రం యచ్చంకరాచార్య విరచితం!
త్రిసంధ్య యః పఠేన్నిత్యం సకుబేర సమోభవేత్
శ్రీ శంకరాచార్య రచించిన ఈ కనకధారా స్తోత్రాన్ని ప్రతిదినం త్రికాలాలలో పఠించుచువాడు కుబేరులతో సమానుడౌతాడు.
సర్వేజనాః సుఖినో భవంతు.

శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్ (Srilakshmee Ashtottara Satanama Stotram)

శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్
(Srilakshmee Ashtottara Satanama Stotram)

దేవదేవ! మహాదేవ! త్రికాలజ్ఞ! మహేశ్వర!
కరుణాకర! దేవేశ! భక్తానుగ్రహకారక!
అష్టోత్తరశతం లక్ష్మా: శ్రోతుమిచ్చామి తత్త్వతః
ఈశ్వర ఉవాచ:
దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనం
సర్వదారిద్ర్య శమనం శ్రమణాద్భుక్తి ముక్తిదమ్
రాజవశ్యకరం దివ్యం గుహ్యార్గుహ్యతరం పరం
దుర్లభం సర్వదేవానాం చతుష్నష్టి కళాస్పదమ్!
పద్యాదీనాం వారాన్తానాం నిధీనాం నిత్యదాయకం
సమస్త దేవ సంసేవ్యం ఆణిమాద్యష్టసిద్ధిదం
కిమత్ర నహునోక్తన దేవీ ప్రత్యక్షదాయకం
తవ ప్రీత్యాద్యవక్ష్యామి సమాహితణాష్క్రణు
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా
క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ
అన్గాన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః
ధ్యానం
వన్డే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం
భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగనై: నానావిధై: భూషితాం
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం
పార్శ్వే పంజక శంఖపద్మ నిధిభి: యుక్తాం సదా శక్తిభి:
సరసిజ నయనే సరోజహస్తే ధవళతరాంశుక గన్ద మాల్య శోభే!
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్
ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హిత్రపదాం
శ్రద్దాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్
వాచంపద్మాలయాం పద్మాం శుచిం స్వాహం స్వధాం సుధాం
ధన్యాం హిరణ్యయీంలక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్
అదితం చ డితం దీప్తాం వసుధాం వసుదారిణీం
నమామి కమలం కాన్తాం క్షమాం క్షిరోద సంభవామ్
అనుగ్రహపరాం బుద్ధిం అనఘాం హరివల్లభాం
అశోకామమృతతాం దీప్తాం లోకశోక వినాశినీమ్
నమామి ధర్మనిలయాల కరుణాం లోకమాతరం
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం
పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమామ్
పద్మ మాలధరాం దేవీం పద్మినీం పద్మగన్థినీమ్
పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం
నమామి చంద్రవదనాం చంద్రా చంద్రహోదారీమ్
చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరామిందుశీతలాం
ఆహ్లదజననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్
విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం
ప్రీతీ పుష్కరిణీం శాన్తాం శుక్లమాల్యామ్భరాం శ్రియమ్
భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం హేమమాలినీమ్
ధనధాన్యకరీం సిద్ధిం స్తైణసౌమ్యాం శుభప్రదాం
నృపవేశ్మగతానన్థాం వరలక్ష్మీం వసుప్రదామ్
శుభాం హిరణ్యప్రాకారం సముద్రతనయం జయామ్
నమామి మంగళాం దేవీం విష్ణువక్ష స్థల స్థితామ్
విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణసమాశ్రితాం
దారిద్ర్యద్వంనీనీం దేవీం సర్వోపద్రవ వారిణీమ్
నవడుర్గాల మహాకాళీం బ్రహ్మ విష్ణుశివాత్మికాం
త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీమ్
లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మన్థకటాక్ష లబ్జ విభవ ద్ర్భహ్మేన్థ గంగాధరాం
త్వాం త్రైలోక్యంకుటుమ్భినీం సరసిజాం వన్దేముకున్థప్రియామ్
మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి
శ్రీ విష్ణుహృత్కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మి!
ప్రసీద సతతం సమతం శరణ్యే
త్రికాలం యో జపేత్ విద్యాన్ షణ్మాసం విజితేన్థియః
దారిద్ర్య ద్వంసనం కృత్యా సర్వమాప్నోత్య యత్నతః
భ్రుగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకం
అష్టైశ్వర్య మావాప్నోతి కుబేర ఇవ భూతలే
దారిద్ర్య యోచనం నామ స్తోత్రమంబాపరం శతం
యేన శ్రియ మనాప్నోతి కోటి జన్మ దరిద్రతఃభక్తాతువిపులన్ భోగాన్ అంత్యే సాయజ్యమాపుయాత్
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వదుఖోపశాంతయే
అష్టస్తు చిన్మయే ద్దేవీం సర్వాభరణభూషితామ్

(ఇవి  ప్రతీ శుక్రవారం పఠి౦చవలెను) 

శ్రీ లక్ష్మీ కవచం (Srilakshmee Kavacham)

మహాలక్ష్మ్యాః ప్రవక్ష్యామి కవచం సర్వకామదం
సర్వపాప ప్రశామనం దుష్ట వ్యాధి వినాశనం
గ్రహపీడా ప్రశమనం గ్రహారిష్ట ప్రభంజనం
దుష్టమృత్యు ప్రశమనం దుష్ట దారిద్ర్య నాశనం
పుత్త్రం పౌత్త్రం ప్రజననం వివాహప్రద మిష్టదం
చోరారి హారి జపతా మఖిలేప్సిత దాయకం
సావధాన మనా భూత్వా శృణు త్వం శుక సత్తమ
అనేక జన్మ సంసిద్ధిలభ్యం ముక్తి ఫలప్రదమ్
ధనధాన్య మహారాజ్య సర్వసౌభాగ్య కల్పకం
సకృ త్స్మరణ మాత్రేణ మహాలక్ష్మీ: ప్రసీదతి
క్షీరాబ్ధి మధ్యే పద్మానాం కాననే మణిమంటపే
తన్మధ్యే సుస్థితాం దేవీ మనీషిజన సేవితామ్
సుస్నాతాం పుష్పసురాభి కుటిలాలక బంధనాం
పూర్ణేంద్రు బింబ వదనా మర్ధచంద్ర లలాటికామ్
ఇందీవరేక్షణాం కామ కోదండ భ్రువ మీశ్వరీం
తిల ప్రసన సంస్పర్ది నాసికాలంకృతాం శ్రియమ్
కుంద కుట్మల దంతాళిం బంధూకాధర పల్లవాం
దర్పణాకార విమల కపోల ద్విత యోజ్జ్వలాం
రత్న తాటంక కలిత కర్ణ ద్వితయ సుందరాం
మంగల్యాభరనోపేతాం కంబుకంఠీం జగత్ప్రసూమ్
తారహారి మనోహరి కుచకుంభ విభూశితాం
రత్నాంగదాది లలిత కరపద్మ చతుష్టయమ్
కమలే చ సుపత్రాడ్యే హ్యభయం దధతీమ వరం
రోమరాజి కళా చారు భుగ్న నాభి తలోధరీమ్
పట్టవస్త్ర సముద్భాసి సునితంబాది లక్షణాం
కాంచన స్తంభ విభ్రాజ ధ్వజ జానూరు శోభితాం
స్మర కాహలికా గర్వహారి జంఘాం హరిప్రియాం
కమఠీ పృష్ట సదృశ పాదాబ్జాంఅ చంద్ర సన్నిభామ్
పంకజోదర లావణ్య సుందరాంఘ్రి తలాం శ్రియం
సర్వాభరణ సంయుక్తాం సర్వలక్షణ లక్షితామ్
పితామహ మహాప్రీతాం నిత్యతృప్తాం హరిప్రియాం
నిత్యం కారుణ్య లలిత ఆం కస్తూరీ లేపి తాంగికామ్
సర్వమంత్ర మయిం దేవీం పద్మనాభ కుటుంబినీం
ఏవం ద్యాత్వాం మహాలక్ష్మిం పఠే త్తత్కవచం పరమ్
ధ్యానం
ఏకం న్యంచ్యం నతిక్షమం మామ పరం చాకుంచ్య పాదాంబుజం
మధ్యే విష్టర పుండరీక మభయం విన్యస్త హస్తాంబుజం
త్వాం పశ్యేమ నిషేదుషీమనుకలం కారుణ్య కూలంకష
స్పారాపాంగ తరంగ మంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీమ్
మహాలక్షం : శిరః పాతు లలాటం మమ పంకజా
కర్ణే రక్షె ద్రమా పాతు నలినే నలినాలయా
నాసికా మవతా దమబా వాచం గాగ్రూపిణీ మమ
దంతా నవతు జిహ్వాం శ్రీ రధరోష్టం హరిప్రియా
చుబుకం పాతు వరదా గళ గంధర్వ సేవితా
వక్షః కుక్షింకరౌ పాయుం పృష్టమవ్యాద్రమా స్వయం
కటిమూరు ద్వయం జాను జంఘం పాతు రమా మమ
సర్వాంగ మింద్రియం ప్రాణా న్పాయా దాయాసహారిణీ
సప్తధాతూన్ స్వయం చాపి రక్తం శుక్రం మనో మమ
జ్ఞానం బుద్ధిం మహోత్సాహం సర్వం మే పాతు పంకజా
మయాకృతం చ యత్కించి త్తత్సర్వం పాతు సేందిరా
మమాయు రవతా ల్లక్ష్మీం: భార్యాం పుత్త్రాంశ్చ
పుట్ట్రికా: మిత్రాణి పాతు సతత మఖిలాని హరిప్రియా
పాతకం నాశయేల్లక్షీం: మమారిష్టం హరిద్రమా
మమారి నాశనార్దాయ మాయా మృత్యుం జయే ద్భలం
సర్వాభీస్టం తు మే దద్యాం త్పాతు మాం కమలాలయా
ఇదం కవచం దివ్యం రమాత్మా ప్రయతః పఠేత్
సర్వసిద్ధి మవాప్నోతి సర్వరక్షాం తు శాశ్వతమ్
దీర్ఘాయుష్మా న్భవే న్నిత్యం సర్వసౌభాగ్య కల్పికం
సర్వజ్ఞ స్సర్వదర్శిచ సుఖదశ్చ సుఖోజ్జ్వలః
సుపుత్త్రో గోపతి శ్రీమాన్ భవిష్యతి నమః సంశయః
తద్గ్రహీన భవేద్ర్భహ్మన్ దారిద్ర్య దురితాదికమ్
నాగ్నినా దహ్యతే గేహం నమః చోరాద్యైశ్చ పీడ్యతే
భూతప్రేత పిశాచాద్యాః సంత్రస్తా యాంతి దూరతః
లిఖిత్వా స్థాపయే ద్యత్ర తత్ర సిద్ధి ర్భవే ద్ధ్రువం
నాపమృత్యు మవాప్నోతి దేహంతే ముక్తిభాగ్భవేత్
ఆయుష్యం పౌష్టికం మేధ్యం ధన్యం దుస్స్వప్న నాశనం
ప్రజాకరం పవిత్రం చ దుర్భిక్షార్తి వినాశనం
చిత్తప్రసాద జననం మహామృత్యు ప్రశాంతిదం
మహారోగ జ్వరం హరం బ్రహ్మహత్యాది శోధనం
మహాధన ప్రదం చైవ పఠితవ్యం సుఖార్ధి భి:
ధానార్దీ ధన మాప్నోతి వివాహార్ధీ లభే ద్వాదూమ్
విద్యార్దీలభతే విద్యాం పుత్త్రార్ధీ గుణ్వ త్సుతం
రాజ్యార్ధీ రాజ్య మాప్నోతి సత్య ముక్తం మయా శుక
ఏతద్దేవ్యా ప్రసాదేన శుకః కవచ మాప్తవాన్
కచవానుగ్రహేనై సర్వా న్కామా నవాప స: