About Me

Over the last few decades I've spent a number of hours cooking for my family of 5. My husband is a retired bank Manager and my 3 boys are IIT graduates. Now I'm sharing my knowledge and thoughts to the world through this site. Whether you are a busy mom or a student learning to cook, you will find this blog helpful for cooking simple and easy to make food for yourself and the whole family. Hope you enjoy my recipe blog! I also love listening to devotional songs. Please browse through my devotional blogs to know more about them. I am always looking for ways to improve my blogs. Please leave your comments. If you like to see recipe of any particular dish or lyrics of a devotional song, please also let me know. Thanks for reading my blog.

Wednesday, 12 October 2011

కార్తీకమాసము

కార్తీక మాస వ్రతము

కార్తీకమాస0 దీపావళి మర్నాడు ను0డి మొదలుకొని 30 రోజులు పాలన చెయ్యాలి. 30 రోజులు చెయ్యలేని వారు మొదటి 15 రోజులు చెయ్యవచ్చు. అది కూడా చెయ్యలేని వారు మొదటి 5 రోజులు, పౌర్ణమి ము0దు 5 రొజులు చెయ్యవచ్చు. ఈ రోజులు కార్తీకమాస0లో  చాలా ముఖ్యమైనవిగా చెప్పబడుతున్నాయి.చెయ్యాలి అనుకొనేవారు వ్రత0 పాలనచేసే రోజులలొ నాన్ వేజ్, వ్లుల్లిపాయ తినకూడదు.  వ్రతమ్ చేసే విదానమ్ క్రి0ద ఇవ్వడ మైనది.
కార్తీక మాస0 పాలన చెసే విదాన0:
 రోజూ తెల్లవారి 5 గ0టలకు లేచి తల స్నానమ్0 చెయ్యాలి. శుబ్రమైన వస్త్రములు దరి0చి విష్ణుపూజ, శివపూజ, తులసి పూజ చెయ్యాలి. ఒక పూట భోజన0 (నాన్ వేజ్ తినకూడడు ) చెయ్యాలి. సాయ0క్ కాల0 గుడిలో దీప0 పెట్టాలి.
వీలయిన0తగ  దాన దర్మ0 లు చెయ్యాలి. 
కార్తీకమాసంతో సమానమైనమాసం, విష్ణువుతో సమానమైన దైవం, వేదంతో సమానమైన శాస్త్రం,గంగతో సమానమైన తీర్దం లేదని చెప్తారు. సూర్యుడు తులారాశిలోకి రాగానే కార్తీకమాసం ఆరంభమైంది.
పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటారు. శివ కేశవులకు అద్యంత ప్రియమైన ఈ మాసంలో ఆచరించవలసిన వ్రతాలు,చేయవలసిన దీపారాధనల గురించి….
కార్తీకమాసంలో ఆధ్యాత్మిక సాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెల మొత్తం తెల్లవారుజాముల నదీతీరంలోగాని, చెరువులు, కొలనులు, బావుల వద్ద స్నానం చేయాలి. స్నానానంతరం ఓం ప్రభాకరాయనమః, ఓం దివాకరాయమః, ఓం ప్రభాకరాయమః, ఓం అచ్చుతాయమః, ఓం నమో గోవిందాయనమః అనే నామాలను స్తుతిస్తూ సూర్యభగవానునికి ఆత్గ్యం పోయాలి. ఈ నెల మొత్తం ఇంటి ముందున్న ప్రధాన ద్వారానికి రెండువైపులా దీపాలను వెలిగించాలి. విష్ణుమూర్తికి అద్యంత ప్రియమైన  పారిజాతము పువ్వులతో పూజి0చవలెను. 

ఉత్థాన ఏకాదశి

ఈ మాసంలో వచ్చే కార్తీకశుద్ధ ఏకాదశి ఎంతో వైశిష్ట్యం వుంది.ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు.దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఉత్థాన ఏకాదశిగా పిలుస్తుంటారు. ఉత్థాన ఏకాదశినాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఈరోజు ఉపవాసం వుండి మరుసటిరోజు ద్వాదశి పారయణం చేస్తే ఎంతో మంచిది. ఈ కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైబోవోపేతంగా పూజలందుకుంటారు ప్రధానంగా భక్తులు కార్తీకమాసంలో శివాలయానికి వెళ్ళి పార్వతీ-సమేత పరమేశ్వరునికి భస్మలేపనం, బిల్వపత్రాలు, అవిసే పూలతో పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మిక.

కోరికలను తీర్చే దీపపు కాంతులు

పౌర్ణమిరోజు వేకువజామున గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటిదొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదులుతుంటారు. ఈ సమయంలో కోరుకున్న కోర్కెలు నెరవేరతాయనే సంకల్పంతో వివాహం కాని యువతులు భక్తిశ్రద్ధలతో కార్తీకదీపాలను నదుల్లో వదులుతారు.
పూర్వం శౌనకాది మహర్షులతో కలిసి ఆశ్రమం నిర్మించుకుని నైమి శారణ్యంలో నివసిస్తున్న అదిగురువు సూత మహర్షి కార్తీకవ్రత మహత్మ్యం, దానిని ఆచరించే విధానం గురించి ఋషులకు బోధించాడు. ఇలాంటి వ్రతమే కావాలని పార్వతీదేవి కుడా ఈశ్వరుని ప్రార్థించినట్టు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు నారదనికి, మహావిష్ణువు లక్ష్మిదేవికి ఈ వ్రతవిధానం చెప్పారు. దీని గురించి స్కందపురాణంలో కూడా వివరించడం విశేషం.కార్తీక పౌర్ణమిరోజు రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని పండితులు చెబుతుంటారు. ఈ రోజు బ్రాహ్మీ సమయంలోనే తులసిని పూజిస్తారు. పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి 365 వత్తులతో హారతి ఇవాలి. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేస్తే చాలా మంచిది.

కార్తీక సోమవారాలు - నదీస్నానాలు

కార్తీకమాసం వచ్చిన వెంటనే నదీస్నానం అత్యంత ప్రధాన మైనదని భక్తులు నమ్ముతుంటారు. లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్తీకమాసంలో వేకువవేళల్లో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం చాలా మంచిదని ఋషులు పేర్కొన్నారు. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైనా వుంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీక మాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. ముఖ్యంగా కార్తీకమాసంలో శివభక్తితో శీతల స్నానమాచరించడం ఆరోగ్యనికి మంచిదని చెబుతారు. దీంతోపాటు ఈ నెలరోజులు భక్తులు సాత్వికాహారం పరి మితంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ మాసంలో ముక్ష్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన భక్తులకు మహత్తరశక్తి కలుగుతుందని చెబుతారు.

కార్తీక పౌర్ణమి

కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీకపౌర్ణమి రోజున దీపారాధన చేయడంవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు.

క్షీరాబ్ది ద్వాదశి:

అలాగే ఏకాదశి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఏకాదశి నాడు విష్ణుమూర్తి క్షీర సాగరం నుంచి బయలుదేరి వచ్చి తనకెంతో ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలో ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. ఆ కారణం చేతనే ఈ రోజున తులసి దగ్గర విశేష పూజలు జరుపుతుండటం ఆచారంగా వస్తోంది. ఈ ద్వాదశినే మధన ద్వాదశి అని కూడా అంటారు.

వనభోజనం

కార్తీకమాసం అంటేనే వనబోజనాల మాసం అని చెప్పుకోవచ్చు. ఉసరిచెట్టుక్రింద శ్రీ మహావిష్ణువుని ఫోటో పెట్టి పూజించడంతో పాటు అదే చెట్టుక్రింద సహబంతి భోజనాలు చేయాలి.

దేవ దానవులు సముద్రాన్ని మధించింది.. కార్తీక శుద్ధ ద్వాదశి నాడని, దానికి గుర్తుగానే ఈ ద్వాదశిని జరుపుకోవడం ఆచారమైందని పెద్దలంటారు. ఈ రోజున కడలిలో శయనించిన విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశినాడు, లక్ష్మీ, బ్రహ్మలాంటి దేవతలందరితో కలిసి తులసి దగ్గరకు వస్తాడు. ఆ రోజున సూర్యాస్తమం తర్వాత తులసిని, విష్ణువును పూజించిన దానాది కార్యక్రమాలు చేసే వారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా దీపదానం చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. 
ఇంకా కార్తీక ద్వాదశి రోజున తులసిని పూజించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ఈ రోజున కొన్ని తులసి దళాలను నములుతూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుచేత కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శివ, విష్ణువులతో పాటు తులసీ కోటను కూడా పూజించేవారికి ఈతిబాధలు తొలగి, సకల సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా ఈ రోజుల్లో శైవ, వైష్ణవ క్షేత్రాలను దర్శించుకునే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

సూర్యాష్టకం – సూర్యాభగవాన్ అష్టకమ్

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

 లోహితం రథమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

బృంహితం తేజసాం పుంజం వాయు రాకాశ మేవచ
ప్రభుస్త్వం సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం

బంధూక పుష్ప సంకాశం హర కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

శ్రీ విష్ణుం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని ఏత్యజంతి రవేర్దినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం

శివాషోత్తర శతనామములు

ఓం శివాయ నమః
ఓం మహెశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినె నమః
ఓం శశిశెఖరాయ నమః
ఓం వామదెవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలొహితాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం శూలపాణయె నమః
ఓం ఖత్వంగినే నమః
ఓం విష్హ్నువల్లభాయ నమః
ఓం శిపివిశ్హ్నయ నమః
ఓం అంభికానాథాయ నమః
ఓం శ్రీకణ్ఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలొకెశాయ నమః
ఓం శితికణ్ఠాయ నమః
ఓం శివాప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినె నమః
ఓం కామారయె నమః
ఓం కాసురసుధానాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం లలాతాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కృపనిధాయే నమః
ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మృగపానయే నమః
ఓం జటాధరాయ నమః
ఓం కైలాసవాసినె నమః
ఓం కవచినే నమః
ఓం కఠొరాయ నమః
ఓం త్రిపురాన్తకాయ నమః
ఓం వృషంకాయ నమః
ఓం వ్రిశ్హభారుదయ నమః
ఓం భస్మొద్ధూలిత విగ్రహాయ నమః
ఓం సామప్రియాయ నమః
ఓం స్వరమయాయ నమః
ఓం త్రయీమూర్తయె నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం పరమాత్మనె నమః
ఓం సొమసూర్యాగ్నిలొచనాయ నమః
ఓం హవీష్ నమః
ఓం యజ్ఞమయాయ నమః
ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విశ్వెశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణానాథయ నమః
ఓం ప్రజాపతయె నమః
ఓం హిరణ్యరెతసె నమః
ఓం దుర్ధర్శ్హాయ నమః
ఓం గిరీశాయ నమః
ఓం గిరిశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజన్గాభుశణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వనే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం క్రిత్తివాససె నమః
ఓం పురారాతయె నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమథాధిపాయ నమః
ఓం మృత్యున్జయాయ నమః
ఓం సూక్ష్మతనవె నమః
ఓం జగద్వ్యాపినె నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యొమకెశాయ నమః
ఓం మహాసెనజనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయె నమః
ఓం స్థాణవె నమః
ఓం అహిర్బుధ్న్యాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం ఆశ్హ్తముర్తయే నమః
ఓం అనెకాత్మనె నమః
ఓం సాత్వికాయ నమః
ఓం శుద్దవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖణ్డపరశవె నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమొచకాయ నమః
ఓం మ్రిదయ నమః
ఓం పాశుపతయే నమః
ఓం దెవాయ నమః
ఓం మహాదెవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరయే నమః
ఓం భగానేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః
ఓం పుష్హదంతభిదే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహశ్రాపడే నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం అనన్తాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమెశ్వరాయ నమః

శ్రీ లింగాష్టకం (Sri Lingashtakam)

బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (1)
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (2)
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (3)
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత షోభిత లింగం
దక్ష సుయజ్న నినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (4)
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (5)
దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభి రేవచ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (6)
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (7)
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (8)
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే.


శివాష్టకం

ప్రభుం ప్రాణనాథం  విభుం విశ్వనాథం జగన్నత నాథం సదానంద భాజం
భావద్ భవ్యభుతేయ్స్వరం భుతనాథం శివం శంకరం శంభు మిశానమిడే ||

గలే రుండమాలం తనవ్  సర్పజాలం మహాకాల కాలం  గానేశాది పాలం
జటాజుట గంగాతరంగైర్విశాలం  శివం శంకరం  శంభు మిశానమిడే  ||

ముదామకరం  మండనం  మండయంతం  మహామండలం  భస్మభూషా ధరాoతంతమ్
అనాది హ్యపారం  మహామోహారూపం శివం శంకరం  శంభు మిశానమిడే  ||

వటాధో  నివాసం  మహాట్టాట్టహాసం  మహాపాపనాశం సదా సుప్రకాశం
గిరీశం  గణేశం  సురేశం మహేశం శివం శంకరం  శంభు మిశానమిడే   ||

గిరీద్రత్మజ సమగృహితర్ధదేహం  గిరావ్  సంస్థితం  సర్వదా పన్నగేశం
పరబ్రహ్మ బ్రహ్మాది భిర్వంధ్యమానం  శివం శంకరం శంభుమిశానమిడే  ||

కపాలం  త్రిశూలం  కరభ్యం  దధానం పదామ్రోజ నమ్రాయ  కామం  దాధానం
బలీవర్దమానం సురాణం  ప్రధానం  శివం శంకరం శంభుమిశానమిడే   ||

శరచ్చంద్రగాత్రం  గూణానంద పాత్రం  త్రినేత్రం  పవిత్రం  ధనేశస్య  మిత్రం
అపర్ణ కళాత్రం సదా సచ్చరిత్రం  శివం  శంకరం  శంభుమిశానమిడే  ||

హారం సర్పాహారం  చితాభువిహారం భావంవేదసారం  సదా నిర్వికారం
స్మశానే వసంతం  మనోజం దహంతం శివం శంకరం శంభు మిశానమిడే  ||

స్వయం యః  ప్రభాతే  నరః శులపాణీ  పటేత్  స్తోత్రరత్నం  త్రిహప్రప్యారత్నం
సుపుత్రం సుభాగ్యం  సుమిత్రం  కళత్రం విచిత్రై  సమారాధ్య  మోక్షం  ప్రయాతి  ||

శ్రీ బిల్వస్తోత్రం (Sri Bilvastotram)

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (1)
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. (2)
కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం. (3)
కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. (4)
ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. (5)
రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం. (6)
అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. (7)
ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. (8)
సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం. (9)
దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. (10)
బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (11)
సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం. (12)
అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం. (13)
బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం.




No comments:

Post a Comment