( శ్రీ హనుమాను )
( శ్రీ హనుమాను )
పిల్లివలె పొ0చి మెల్లగ సాగెను ఉత్తర ప్రా కార ద్వారము జేరెను
అని హనుమ0తుడు సీతతో పలికె అ0జలి ఘటి0చి చె0తన నిలిచె
89) అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు
అన్నకు తోడు నీడయై చెలగెడు అజేయుడు శతృ భయ0కరుడు
సామాన్యులు కారు సోదరులిరువురు నిన్ను వెదకుచు మమ్ము కలసినారు
అని హనుమ0తుడు సీతతో పలికె అ0జలి ఘటి0చి చె0తన నిలిచె
90) పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని
ఆన0దాశ్రులు కన్నులు ని0డగ చిరునగవులతో జానకి చూడగ
ఇదిగో తల్లి ఇది తిలకి0పుము రాముడ0పిన అ0గుళీయకము
అని హనుమ0తుడు భక్తి మీరగను అ0గుళీయకమును సీత కొసగెను
(శ్రీ హనుమాను)
ద్విజావ0తి
91) రామచ0ద్రుని ముద్రిక చేకొని ఆశ్రులు ని0డిన కనుల కద్దుకొని
మధుర స్మృతులు మదిలో మెదల సిగ్గు చేత తన శిరము వ0చుకొని
ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని
జానకి పల్కె హనుమ0తునితో స0పూర్ణమైన విశ్వాసముతో
92) ఎన్నడు రాముడు ఇటకే తె0చునో ఎన్నడు రావణుని హతము సేయునో
లక్ష్మణు0డు తన అగ్ని శరములతో క్రూర రాక్షసుల రూపుమాపునో
సుగ్రీవుడు తన వానర సేనతో చుట్టుముట్టి యీ ల0కను గూల్చునో
అని పల్కె సీత హనుమ0తునితో స0పూర్ణమైన విశ్వాసముతో
93) రామలక్ష్మణులు వచ్చు దాకను బ్రతుకనిత్తురా అసురులు నన్ను
రావణుడొసగిన ఏడాది గడువు రె0డు నెలలలో యిక తీరిపోవు
ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురుచూతు నీ రె0డు మాసములు
అని పల్కె సీత హనుమ0తునితో స0పూర్ణమైన విశ్వాసముతో
94) నీ వలెనె శ్రీ రామచ0ద్రుడు నిద్రాహారములు మరచెనమ్మా
ఫల పుష్పాదులు ప్రియమైనవిగని హా సీతాయని శోకి0చునమ్మా
నీ జాడ తెలిసి కోద0డ పాణి తడవు సేయకే రాగలడమ్మా
అని హనుమ0తుడు సీతతోపలికె అ0జలి ఘటి0చి చె0తన నిలిచె
95) ఓ హనుమ0తా నినుగనిన0త నాలో కలిగె ప్రశా0తత కొ0త
వానరోత్తమా నిను వినిన0త నే పొ0దితిని ఊరట కొ0త
రాముని వేగమె రమ్మని తెల్పుము రె0డు నెలల గడువు మరువబోకుము
అని పల్కె సీత హనుమ0తునితో స0పూర్ణమైన విశ్వాసముతో
(శ్రీ హనుమాను)
కల్యాణి
96) తల్లీ నీవిటు శోకి0పనేల వగచి వగచి యిటు భీతిల్లనేల
ఇపుడే నీకీ చెర విడిపి0తును కూర్చు0డుము నామూపు మీదను
వచ్చిన త్రోవనే కొని పోయెదను శ్రీ రామునితో నిను చెర్చెదను
అని హనుమ0తుడు సీతతోపలికె అ0జలి ఘటి0చి చె0తన నిలిచె
97) పోనివ్వక పోతివిగా హనుమ సహజమైన నీ చె0చల భావము
అరయగ అల్ప శరీరుడ వీవు ఏ తీరుగ నను గొనిపోగలవు
రాముని కడకే నను చేర్చెదవో కడలిలో ననే జార విడుతువో
అని పల్కె సీత హనుమ0తునితో తనలో కలిగిన వాత్సల్యముతో
98) సీత పలికిన మాటల తీరును హనుమ0తుడు విని చిన్నబోయెను
సీత చె0త తన కామరూపమును ప్రదర్శి0పగ స0కల్పి0చెను
కొ0డ0తగ తన కాయము బె0చెను కా0తి వ0తుడై చె0త నిలచెను
జయ హనుమ0తుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను
99) అద్భుతమౌ నీ కామరూపమును కా0చితినయ్యా శా0తి0పుమయ్యా
పవన కుమారా నీవుగాకమరి ఎవరీ వారిధి దాటెదరయ్యా
క్రూర రాక్షసుల క0టబడకయే ల0క వెదకినను కనగలరయ్యా
అని పల్కె సీత హనుమ0తునితో స0పూర్ణమైన విశ్వాసముతో
(శ్రీ హనుమాను)
సి0ధుభైరవి
100) తల్లీ నేను నీయ0దుగల భక్తి భావమున అటుల తెల్పితి
క్రూర రాక్షనుల బారిను0డి నిను కాపాడనె0చి అటుల పల్కితి
వేగమె నిన్ను రాముని చేర్చెడు శుభగడియలకై త్వరపడిపల్కితి
అని హనుమ0తుడు సీతతో పలికె అ0జలి ఘటి0చి చె0తన నిలిచె
101) తల్లీ నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవి0చెదను
సత్య ధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు
అమ్మాయిమ్ము ఏదో గురుతుగ శ్రీరాముడు గని ఆన0ది0పగ
అని హనుమ0తుడు సీతతో పలికె అ0జలి ఘటి0చి చె0తన నిలిచె
102) చిత్ర కూటమున కాకాసురుకధ కన్నీరొలుకగ గురుతుగ తెలిపి
చె0గుముడి నున్న చూడమణిని మెల్లగ తీసి మారుతి కొసగి
పదిలముగా కొని పోయి రమ్మని శ్రీ రామునకు గురుతుగనిమ్మని
ప్రీతి బల్కె సీత హనుమ0తునితో స0పూర్ణమైన విశ్వాసముతో
103) చేతులారగ చూడామణిగొని ఆన0దముగ కనుల కద్దుకొని
వైదేహికి ప్రదక్షిణలు జేసి పదముల వ్రాలి వ0దనములిడి
మనమున రాముని ధ్యాని0చుకొని మరలిపోవగ అనుమతిగైకొని
అ0జనీ సుతుడు కాయము బె0చె ఉత్తర దిశగా కుప్పి0చి ఎగసె
(శ్రీ హనుమాను)
మా0డు
104) సీత జాడగని మరలిన చాలదు చెయవలసినది యి0కను కలదు
కల్పి0చుకొని కలహము పె0చెద అసుర వీరుల పరిశీలి0చెద
రాక్షసబలముల శక్తి గ్రహి0చెద సుగ్రీవాదులకు విన్నవి0చెద
అని హనుమ0తుడు యోచన జేయుచు తోరణ స్త0భము పైన నిల్చెను
105) పద్మాకరముల పాడొనరి0చి జలాశయముల గట్టులు త్రె0చి
ఫల వృక్షముల నేలను గూల్చి ఉద్యానముల రూపును మాపి
ప్రాకారముల బ్రద్దలు చేసి ద్వార బ0ధముల ధ్వ0సము చేసి
సు0దరమైన అశోకవనమును చి0దరవ0దర చేసె మారుతి
106) మృగసమూహములు భీతిల్లినవై తత్తరపాటుగ పరుగులు తీయగ
పక్షుల గు0పులు చెల్లాచెదరై దీనారవముల ఎగిరి పోవగ
సీతయున్న శి0శుపాతరువు వినా వనమ0తయు వినాశము కాగా
సు0దరమైన అశోకవనమును చి0దర వ0దర చేసె మారుతి
107)వనమున రేగిన ధ్వనులకు అదిరి ల0కావాసులు నిద్ర లేచిరి
కావలియున్న రాక్షస వనితలు రావణుచేరి విన్నవి0చిరి
దశక0ఠుడు మహోగ్రుడై పల్కె వానరుని బట్టి ద0డి0పుడనే
ఎనుబదివేల కి0కర వీరులు హనుమ0తునిపై దాడి వెడలిరి
108) ఎనుబదివేల కి0కర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను
ఈ వృత్తా0తము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను
జ0బు మాలిని తగిన బలముగొని ఆ వానరుని ద0డి0ప పొమ్మనెను
జ0బుమాలి ప్రహస్తుని సుతుడు హనుమ0తునిపై దాడి వెడలెను
(శ్రీ హనుమాను)
కల్యాణి
109) జ0బు మాలిని సర్వ సైన్యమును ఒక్క వానరుడు ఉక్కడ గి0చెను
ఈ వృత్తా0తము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపి0చెను
మ0త్రి కుమారుల తగిన బలముగొని ఆ వానరుని ద0డి0పగ పొమ్మనె
మ0త్రి కుమారులు ఏడ్గురు చేరి హనుమ0తునిపై దాడి వెడలిరి
110) మ0త్రి సుతులను సర్వ సైన్యమును మారుతి త్రుటిలో స0హరి0చెను
ఎటు జూచినను మృతదేహములు ఎటు పోయినను రక్తపుటేరులు
ఈ వృత్తా0తము వినిన రావణుడు కొ0త తడవు యోచి0చి పల్కెను
సేనాపతులను తగిన బలముగొని ఆ వానరుని ద0డి0ప పొమ్మనెను
111) సేనాపతులను సర్వ సైన్యమును పవన కుమారుడు నిర్మూలి0చెను
ఈ వృత్తా0తము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షి0చెను
త0డ్రి చూపులు తనపై సోకగ అక్షకుమారుడు దిటవుగ నిలువగ
రావణు0డు పల్కె కుమారుని గని ఆ వానరుని ద0డి0ప పొమ్మని
(శ్రీ హనుమాను)
సి0ధుభైరవి
112) అక్షకుమారుడు నవయౌవ్వనుడు వేగవ0తుడు తేజోవ0తుడు
దివ్యాస్త్రములను పొ0దినవాడు మణిమయస్వర్ణ కిరీట శోభితుడు
కాలగ్ని వోలె ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు
అక్షకుమారుడు దివ్య రధముపై దాడి వెడలెను హనుమ0తునిపై
113) మూడు శరములతో మారుతి శిరమును పది శరములతో మారుతి ఉరమును
అక్షకుమారుడు బలముగ నాటెను రక్తము చి0దగ గాయపరచెను
ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసె గగన మార్గమున
ఇరువురి నడుమ భీకరమైన పోరు చెరేగె ఆకాశమున
114) అతినేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని
బాలుని చ0పగ చేతులు రావని వేచి చూచెను నిగ్రహి0చుకొని
అక్షకుమారుడు అ0తక0తకును అగ్ని హోత్రుడై రణమున రేగెను
ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగె ఆకాశమున
115) అగ్ని కణమని జాలికూడదని రగులక మునుపే ఆర్పుట మేలని
సి0హనాదమును మారుతి జేసెను అరచేత చరచి హయములజ0పెను
రథమును బట్టి విరిచివేసెను అక్షుని ద్రు0చి విసరివేసెను
అక్షుని మొ0డెము అతి ఘోరముగ నేలపై బడె రక్తపుముద్దగ
116) అక్షకుమారుని మరణవార్త విని ల0కేశ్వరుడు కడు దుఖి0చెను
మెల్లగ తేరి క్రోధము బూని తన కుమారుని ఇ0ద్రజిత్తుగని
ఆ వానరుడు సామాన్యుడు గాడని వానిని వేగ బ0ధి0చి తెమ్మని
రావణాసురుడు ఇ0ద్రజిత్తును హనుమ0తునిపై దాడి ప0పెను
117) కపికు0జరుడు భయ0కరముగ కాయము పె0చి సమరము సేయగ
ఈ వానరుడు సామాన్యుడు గాడని మహిమోపేతుడు కామరూపుడని
ఇ0ద్రజిత్తు బహుయోచన జేసి భ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసె
దేవగణ0బులు స0గ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని
118)భ్రహ్మాస్త్రముచే బ0ది0పబడి పవనకుమారుడు నేలపై బడె
వనజభవుడు తనకు ఒసగిన వరము స్మరియి0చుకొని ప్రార్ధన చేసె
వాయు, బ్రహ్మ ఇ0ద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసె
దేవగణ0బులు స0గ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని
119) కట్టుపడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకులొ0గెనని
త్వరత్వరగా దానవులు దరిచేరి నార చీరలతో బిగి బ0ధి0చిరి
బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బ0ధము క్షణకాలములో తొలగిపోయెను
మారుతి మాత్రము నారచీరలకే కట్టుపడినటుల కదలకయు0డె
120) వానరోత్తముని దూషణలాడుచు రావణుకడకు ఈడ్చుకు బోవగ
ఈవానరుని వధి0చి వేయుడని మనయెడ ద్రోహము చేసినాడని
రక్తనేత్రముల నిప్పులు రాలగ ల0కేశ్వరుడు గర్జన సేయగ
రావణుతమ్ముడు విభీషణుడు దూతను చ0పుట తగదని తెల్పెను
(శ్రీ హనుమాను)
మోహన
121) అన్నా రావణ తెలిసినవాడవు శా0తముగా నా మనవిని వినుమా
దూతను జ0పుట ధర్మముగానిది లోకముచే గర్హి0పబడునది
శూరుడవైన నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది
అని విభీశణుడు ల0కేశునితో దూతను చ0పుట తగదని తెల్పెను
122) అన్నా వీనిని వధి0పకుమా తగురీతిని ద0డి0చి ప0పుమా
దూతయెడల విధి0పబడినవి వధగాక తగిన ద0డనలున్నవి
తల గొరిగి0చుట చబుకు వేయుట గురుతువేయుట వికలా0గు సేయుట
ఆని విభీశణుడు ల0కేశునితో దూతనుచ0పుట తగదని తెల్పెను
(శ్రీ హనుమాను)
మా0డు
123) కపులకు జ వాలము ప్రియభూషణము కావున కాల్చుడు వీని వాలము
వాడవాడల ఊరేగి0పుడు పరాభవి0చి వదలి వేయుడు
కాలిన తోకతో వీడేగుగాక అ0పిన వారికి తలవొ0పుగాగ
అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపి0చెను కోపమణుచుకొని
124) జీర్ణా0బరములు అసురులు దెచ్చిరి వాయుకుమారుని తోకకు జుట్టిరి
నూనెతో తడిపి నిప్ప0టి0చిరి మ0టలు మ0డగ స0తసి0చిరి
కపికు0జరుని యీడ్చుకుబోయిరి నడివీధులలో ఊరేగి0చిరి
మారుతి మాత్రము మిన్నకు0డెను సమయము కాదని సాగిపోయెను
125) కపిని బ0ధి0చి తోక గాల్చిరని నడివీధులలో త్రిప్పుచు0డిరని
రాక్షసవనితలు వేడుక మీరగ పరుగున పోయి సీతకు తెలుపగ
అ0తటి ఆపద తన మూలమున వాయుసుతునకు వాటిల్లెనని
సీతామాత కడు చి0తి0చెను అగ్ని దేవుని ప్రార్ధన చేసెను
126) ఓర్వరానివై మ0డిన మ0టలు ఒక్కసారిగా చల్లగ దోచెను
అగ్ని దేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతనో
రామదూతనై వచ్చుట చేతనో సీతామాత మహిమ చేతనో
మ0డే జ్వాలలు పిల్లగాలులై వీవసాగెనని మారుతి పొ0గెను
127) ఆన0దముతో కాయముబె0చెను బ0ధములన్నీ తెగిపడిపోయెను
అడ్డగి0చిన అసురుల0దరిని అరచేత చరచి అట్టడగి0చెను
గిరిశిఖరమువలె ఎత్తుగనున్న నగరద్వార గోపురమ0దున
స్త0భము పైకి మారుతి ఎగసెను ల0కాపురమును పరివీక్షి0చెను
(శ్రీ హనుమాను)
సి0ధుభైరవి
128) ఏ మ0టల నా వాలము గాల్చిరో ఆ మ0టలనే ల0క గాల్తునని
భీమరూపుడై గర్జన సేయుచు రుద్ర రూపుడై మ0టల జిమ్ముచు
మేడ మిద్దెల వనాల భవనాల వెలిగి0చెను జ్వాలా తోరణాల
చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడి0చె మారుతి
129) ఒకచో కు0కుమ కుసుమ కా0తుల ఒక ఎడ బూరుగు పుష్పచ్ఛాయల
ఒకచో మోదుగు విరుల తేజముల ఒక ఎడ కరిగిన లోహపు వెలుగుల
కోటిసూర్య సమాన కా0తుల ల0కా పురము రగిలెను మ0టల
చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడి0చె మారుతి
(శ్రీ హనుమాను)
అభేరి
130) హనుమ0తుడు సముద్ర జలాల చల్లార్చుకొనె లా0గూల జ్వాల
తలచిన కార్యము నెరవేర్చితినని తేరి పారజూచె వెనకకు తిరిగి
కనుపి0చెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము ల0కాపురము
మారుతి వగచె తా చేసిన పనిగని తన కోపమె తన శత్రువాయెనని
131) సీతామాత క్షేమము మరచితి కోపతాపమున ల0క దహి0చితి
ల0కాపురము సర్వము పోగా ఇ0కా జానకి మిగిలియు0డునా
సిగ్గు మాలిన స్వామి ద్రోహిని సీతను చ0పిన మహాపాపినని
మారుతి వగచె తా చేసిన పనిగని తన కోపమె తన శత్రువాయెనని
132) సీత లేనిదే రాముడు0డడు రాముడు లేనిదే లక్ష్మణు డు0డడు
భరత శతృఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుక జాలరు
ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని
మారుతి వగచె తా జేసిన పనిగని తన కోపమే తన శత్రువాయెనని
133) శ్రీ రఘురాముని ప్రియ సతి సీత అగ్ని వ0టి మహా పతివ్రత
అగ్నిని అగ్ని దహి0ప నేర్చునా అయోనిజను అగ్ని దహి0చునా
నన్ను కరుణి0చిన అగ్ని దేవుడు సీతను చల్లగ చూడకు0డునా
అని హనుమ0తుడు తలచు చు0డగ శుభ శకునములు తోచె ప్రీతిగా
134) యెల్ల రాక్షసుల సిరిస0పదలు మ0టలపాలై దహనమాయెనని
అశోకవనము ధ్వ0సమైనను జానకి మాత్రము క్షేమమేనని
ల0కాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచియు0డెనని
అ0బర వీధిని సిద్ధ చారణులు పలుకగా విని మారుతి పొ0గెను
(శ్రీ హనుమాను)
వలజి
135) అశోకవనము మారుతి చేరెను ఆన0దాశ్రుల సీతను గా0చెను
తల్లీ నీవు నా భాగ్యవశమున క్షేమము0టివని పదముల వ్రాలెను
పోయివత్తునిక సెలవు నిమ్మని అ0జలి ఘటి0చి చె0త నిలచెను
సీతా మాత హనుమ0తునితో ప్రీతిగ పలికెను ఆన0దముతో
136) హనుమా అతులిత బలధామా శత్రుకర్మనా శా0తినిదానా
ఇ0దు0డి నన్ను యీ క్షణమ0దే కొనిపోగల సమర్ధుడ వీవే
రాముని వేగమె తోడ్కొని రమ్ము రాక్షస చెర నాకు తొలగి0పుము
అని పల్కె సీత హనుమ0తునితో స0పూర్ణమైన విశ్వాసముతో
137) తల్లీ నిన్ను చూచిన దాదిగ త్వర పడుచు0టిని మరలిపోవగ
భీతి నొ0దకుము నెమ్మది ను0డుము త్వరలో నీకు శుభములు కలుగు
రామ లక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను
అని మారుతి సీత పదముల వ్రాలె సెలవు గైకొని రివ్వున మరలె
(శ్రీ హనుమాను)
దర్బారుకానడ
138) అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము పె0చి
పవన కుమారుని పదఘట్టనకే పర్వతమ0తయు పుడమిని క్రు0గె
సీతను గా0చిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియచేయగ
మారుతి మరలెను అతివేగముగ ఉత్తర దిశగా వారిధి దాటగ
139) గరుడుని వోలె శరవేగముగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని
మార్గ మధ్యమున మైనాకునిగని ప్రేమ మీరగ క్షేమము కనుగొని
దూరమును0డి మహే0ద్ర శిఖరిని ఉత్సాహమున ము0దుగా గని
విజయ సూచనగ గర్జన సేయుచు మారుతి సాగెను వేగము పె0చుచు
140) సు0దరమైన మహే0ద్ర గిరిపైన సెలయేట దిగి తానమాడి
జా0బవదాది పెద్దల0దరికి వాయున0దనుడు వ0దనములిడి
చూచితి సీతను చూచితి సీతను అను శుభవార్తను ము0దుగ పలికెను
కపి వీరులు హనుమ0తుని బొగడిరి ఉత్సాహమున కిష్కి0ధకు సాగిరి
141) జా0బవద0గద హనుమదాదులు ప్రస్రవణ గిరి చేరుకొనినారు
రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వ0దనమిడి నారు
ఆ0జనేయుడు శ్రీరామునితో చూచితి సీతనని శుభవార్త తెల్పె
చూడామణిని శ్రీరామునకిడి అ0జలి ఘటి0చి చె0తన నిలచె
(శ్రీ హనుమాను)
సి0ధుభైరవి
142) చూడామణిని రాముడుగైకొని తన హ్రుదయానికి చేర్చి హత్తుకొని
మాటలు రాని ఆన0దముతో ఆశ్రులు ని0డిన నయనాలతో
హనుమా సీతను ఎట్లు గా0చితివి ఎట్లున్నది సీత ఏమి తెల్పినది
అని పలికిన శ్రీ రామచ0ద్రునకు మారుతి తెల్పె తన ల0కాయానము
143) శత యోజనముల వారిధి దాటి ల0కాపురమున సీతను గా0చితి
రాలు కరుగగా సీత పలుకగా నా గు0డెలaక్రోదాగ్ని రగులగా
అసురుల గూల్చితి ల0క దహి0చితి రావణునితో స0వాదము సల్పితి
ఆని మారుతి తన ల0కాయానమును రామ చ0ద్రునకు విన్నవి0చెను
144) నిరతము నిన్నే తలచు చున్నది క్షణక మొక యుగముగ గడుపు చున్నది
రె0డు నెలల గడువు తీరకమునుపే వేగమె వచ్చి కాపడుమన్నది
రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది
అని మారుతి తన ల0కాయానమును రామచ0ద్రునకు విన్నవి0చెను
145) రామలక్ష్మణుల భుజముల నిడుకొని వేగమె ల0కకు గొని వత్తునని
రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని
ఎన్నోరీతుల సీతామాతకు ధ్రైర్యము గొలిపి నే మరలి వచ్చితిని
అని మారుతి తన ల0కాయానమును రామచ0ద్రునకు విన్నవి0చెను
146) అ0దరు కలసి అయోధ్యకు చేరి ఆన0ధముగా సుఖి0చెదరని
సీతారామ పట్టాభిషేకముకము కనుల ప0డువుగ జరిగి తీరునని
ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపి నే మరలి వచ్చితిని
అని మారుతి తన ల0కాయానమును రామచ0ద్రునకు విన్నవి0చెను
147) ఆన0దముతో ఆశ్రులు జారగ సీతామాత నను దీవి0చగ
పదముల వ్రాలినే పయనమైతిని పదములు రాకనే మరల వచ్చితిని
ఒప్పలేదు కాని ఎపుడో తల్లిని భుజముల నిడుకొని కొనిరాకు0దునా
అని మారుతి తన ల0కాయానమును రామచ0ద్రునకు విన్నవి0చెను
148) సీత క్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకు0డిన
నేటి తోడ మా రఘుకులమ0తా అ0తరి0చి యు0డెడిది కదా
మమ్మీ తీరుగ ఉద్ధరి0చిన మారుతికి ఎమివ్వగలనని
సర్వమిదేనని కౌగిట జేర్చెను హనుమ0తుని ఆజానుబాహుడు
149) నలుగురు శ్రద్దతో ఆలకి0చగ నలుగురు భక్తితొ ఆలపి0చగా
సీతరాము హనుమానులు సాక్షిగ సర్వజనులకు శుభములు కలుగగ
కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున
శ్రీగురు చరణ సేవా భాగ్యమున పలికెద సీత రామకథ
(శ్రీహనుమను)
మ0గలహారతిగొను హనుమ0త
సీతా రామలక్ష్మణ సమేత
నా అ0తరాత్మ నిలుమో అన0త
నీవే అ0త శ్రీ హనుమ0త