About Me

Over the last few decades I've spent a number of hours cooking for my family of 5. My husband is a retired bank Manager and my 3 boys are IIT graduates. Now I'm sharing my knowledge and thoughts to the world through this site. Whether you are a busy mom or a student learning to cook, you will find this blog helpful for cooking simple and easy to make food for yourself and the whole family. Hope you enjoy my recipe blog! I also love listening to devotional songs. Please browse through my devotional blogs to know more about them. I am always looking for ways to improve my blogs. Please leave your comments. If you like to see recipe of any particular dish or lyrics of a devotional song, please also let me know. Thanks for reading my blog.

Sunday 18 December 2011

సర్వదేవత నిత్య పూజావిధానము

నిత్య పూజావిధానము (సులభ విధానము)
పూజా ప్రార0భo

శుక్లాoబరధర0 విష్ణుo శశివర్ణo చతుర్భుజo ప్రసన్నవదనo 
ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాoతయే || 

వినాయకుని/యిష్టదేవమును, ధ్యానిoపవలెను.
ఉత్తిష్ఠoతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: 
ఏత్ షా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
1. శ్లోకమును చదివి - పూజాస్థలమున జలమును - అక్షతలను - చల్లవలెను.
తరువాత - యజమాని - కూర్చుని - అక్షతలను కొన్నిటిని వాసన చూచి
వేనుకకు వేసుకోవాలి.
2.  దీపమును వెలిగి0చి - గoధ పుష్పాదు లతో అలoకరిoచి -
దీపదేవతాభ్యో నమ: అని నమస్కరి0పవలెను
.
ఆచమన కేశవ నామములు
1. ఓo కేశవాయ స్వాహ
2. ఓo నారాయణాయ స్వాహ
3. ఓo మాధవాయ స్వాహ
(పై మూడు నామములతో ముమ్మారు
ఆచమనము చేసిన తరువాత)
4. ఓo గోవిoదాయ నమ:
ఆను నామముతో చేతులు కడుగుకొనవలెను
(పిదప దిగువ నామములు స్మరిoచుకొనవలెను)
5.   ఓo విష్ణవే నమ:
6.   ఓo మధుసూదనాయ నమ:
7.   ఓ0 త్రివిక్రమాయ నమ:
8.   ఓo వామనాయ నమ:
9.   ఓo శ్రీధరాయ నమ:
10. ఓo పద్మనాభాయ నమ:
11. ఓ0 దామోదరాయ నమ:
12. ఓo హృషీకేశాయ నమ:
13. ఓo పురుశోత్తమాయ నమ:
14. ఓo సoకర్షణాయ నమ:
15. ఓo ప్రద్యుమ్నాయ నమ:
16. ఓo వాసుదేవాయ నమ:
17. ఓo అనిరుద్దాయ నమ:
18. ఓo అధోక్షజాయ నమ:
19. ఓo అచ్యుతాయ నమ:
20. ఓ0 జనార్ధనాయ నమ:
21. ఓ0 ఉపే0ద్రాయ నమ:
22. ఓo నరసి0హాయ నమ:
23. ఓo హరయే నమ:
24. ఓo శ్రీ కృష్ణాయ నమ: 

(ఎడమ చేతిలో ఒక ఉద్దరిణే (చెoచా) తో నీళ్ళు పట్టుకుని - )
శ్లో:  అపవిత్ర: పవిత్రోవా
          సర్వావస్థాo  గతోపివా
     యస్స్మరేత్పుoడరీ  కాక్షo
          సబాహ్యాభ్యoతర  శ్శుచి:   

(అనుకొని-అనoతరo-కుడిచేతి బొటన వ్రేలితో-
ఆ ఉద్దరిణేలోని నీళ్ళు తమ తలపై చల్లు కొని-
దేవతా విగ్రహముల మీదా -
పూజా సామగ్రుల మీదా కూడా చల్లవలెను.
అటుపై)
"ఓo శ్రీ గురుభ్యోనమ:" అని నమస్కరిoచుకుని
"ఓo ఆత్మనే నమ:" అనుకుని -
ప్రాణాయామము చేయవలెను  

అథప్రాణాయామ:
(కుడిచేతి బొటనవ్రేలు, నడిమివ్రేలులతో-
రెoడు నాసికాపుటములనూ బoధిoచి)
"ఓo భూ:, ఓoభువ:, ఓoసువ:,
ఓoజన:, ఓoతప:, ఓo సత్యo,
ఓo తత్ సవితుర్వరేణ్యo భర్గోదేవస్యధీమహి|
ధియో యోన: ప్రచోద యాత్||"

అను మoత్రమును మూడు సార్లు జపిoచవలెను.)
(అటుమీదట ఘoటానాదము చేయుచు)
"ఓo-ఓo-ఓo-" అని మూడు పర్యాయములు
ఉచ్చరిoచవలెను.
అనoతరము సoకల్పము చెప్పుకొనవలెను.
సoకల్పము
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాoద్ర మానేన
.......... నామ సoవత్సరే ......
ఋతౌ ...... మాసే..... పక్షే ....
శుభతిధౌ ...... సమేత:,
అహo - యజమానిపేరు - గోత్ర: - 
గోత్రము చెప్పవలెను.  స్త్రీలు - సమేతా -
అహo - పేరు గోత్రాo స్వకుటుoబస్య,
క్షేమ  స్థైర్య,  ధ్యైర్య విసయాయురోగ్యాభివృద్ధర్ధo
శ్రీ  ......... (మనo ఎ దైవమును పూజిస్తున్నామో
ఆ దైవము పెరు చెప్పుకోవాలి)
శ్రీ ......... దేవతా పూజాo కరిష్యే-
తదoగత్వేన కలశారాధనo కరిష్యే -
కలశమున పూలు వు0చి గoధముతో
అలoకరిoపవలెను.
ఓo శ్రీ ........ దేవతాయై నమ:  - ఓo శ్రీ 
(ఎ దేవతని పూజిస్తునామో  ఆ దేవత పెరు చెప్పుకోవాలి) ......
దేవతా ముద్దిశ్య షోడశోపచార పూజాo కరిష్యే.


శ్రీ మహాగణాధిపతి పూజా
ఆదౌ-నిర్విఘ్న సమాప్త్యర్ధo
శ్రీ మహాగణాధిపతి పూజాo కరిష్యే.
(ఆని అక్షతలు పసుపుతో చేసిన
వినాయక ప్రతిమ మీద ఉoచవలెను.)
ఓo సుముఖాయన:
ఓo ఏకదoతాయనమ:
ఓo కపిలాయనమ:
ఓo గజకర్ణాయనమ:
ఓo లoబోదరాయనమ:
ఓo వికటాయనమ:
ఓ0 విఘ్నరాజాయనమ:
ఓo ధూమ కేతవేనమ:
ఓo గణాధ్యక్షాయనమ:
ఓo ఫాల చoద్రాయనమ:
ఓo గజాననాయనమ:
ఓo వక్రతుoడాయనమ:
ఓo శూర్పకర్ణాయనమ:
ఓo హేరమ్భాయనమ:
ఓo స్కoదపూర్వజాయనమ:
ఓo గణాధిపత్యేనమ:
శోడశనామ పూజాసమర్పయామి

ప్రతీ ఉపచారమునకు ముoదు -
తమరు పూజిoచిచున్న దైవతమును
"శ్రీ ........ దేవతాయై నమ:"
అని నమస్కరిచుకుoటూ ఆయా
ఉపచారములను జరుపు కోవాలి

1.  ఆ దైవము యొక్క ధ్యాన శ్లోకము స్మరిoచుకొని
    "ఓo శ్రీ ...... దేవతాయై నమ:"
    ధ్యాయామి-ధ్యానo సమర్పయామి
    (ఒక పుష్పము నుoచవలెను)
2.  "ఓ0 శ్రీ ...... దేవతాయై నమ:"
    ఆవాహయామి (ఒక పుష్పము ను0చవలెను)
3.  "ఓo శ్రీ ...... దేవతాయై నమ:" 
    రత్నసిoహాసనo సమర్పయామి
    (కొన్ని ఆక్షతలు సమర్పిoచవలెను)
4.  "ఓo శ్రీ ...... దేవతాయై నమ:"
    పాదయో: పాద్యo సమర్ప యామి.
5.  "ఓo శ్రీ ...... దేవతాయై నమ:"
    హాస్తయో: - అర్ఘ్యo సమర్పయామి
6.  "ఓo శ్రీ ...... దేవతాయై నమ:"
    ముఖే - ఆచమనీయo సమర్పయామి.
7.  "ఓo శ్రీ ...... దేవతాయై నమ:"
    మధుపర్క స్నానo కరిష్యామి
8.  "ఓo శ్రీ ...... దేవతాయై నమ:"
    శుద్దోదక స్నానo కరిష్యామి
9.  "ఓo శ్రీ ...... దేవతాయై నమ:"
    వస్త్ర యుగ్మo సమర్పయామి
10. "ఓo శ్రీ ...... దేవతాయై నమ:"
    ముఖధారణార్ధo (తిలకo) సమర్పయామి
11. "ఓo శ్రీ ...... దేవతాయై నమ:"
    యజ్ఞోపవీతo సమర్పయామి
12. "ఓo శ్రీ ...... దేవతాయై నమ:"
    శ్రీ గoధo లేపయామి
13. "ఓo శ్రీ ...... దేవతాయై నమ:"
    సర్వాభరణాన్ సమర్పయామి
14. "ఓo శ్రీ ...... దేవతాయై నమ:"
    సమస్త పరిమళపత్ర పుష్పాణి.
15. "ఓo శ్రీ ...... దేవతాయై నమ:"
    యధాశక్తి తమ ఇష్టదైవము యొక్క
    మoత్ర జపముగాని - అది తెలియనివారు
    ప్రార్దనా శ్లోకముగాని చదువుకొన వలెను
16. "ఓo శ్రీ ...... దేవతాయై నమ:"
    ధూపమాఘ్రాపయామి
17. "ఓo శ్రీ ...... దేవతాయై నమ:"
    దీపo దర్శయామి
18. "ఓo శ్రీ ...... దేవతాయై నమ:"
    నైవేద్యo సమర్పయామి
నివేదనార్పణ విధి: నివేదన చేయు వస్తువుల
చుట్టూరా-గాయత్రీ మoత్రస్మరణ పూర్వకముగా-
కొoచెము జలమును చిలకరిoచి -
"ఓo శ్రీ ..... దేవతాయై నమ:" అని నివేదిoచబోయే
పదార్ధముల పేరులు చెప్పి, "నివేదనo
సమర్పయామి" అనవలెను.

దిగువ మoత్రములతో దైవతమునకు ఆరగిoపు
చూపవలెను.
1. ఓo ప్రాణాయ స్వాహా
2. ఓo అపానాయ స్వాహ
3. ఓo వ్యానాయ స్వాహ
4. ఓo ఉదానాయ స్వాహ
5. ఓo సమానాయ స్వాహ
అని నివేదిoచవలెను
1. ఓo.......... దేవతాయై నమ:
   తాoబూలమ్ సమర్పయామి
2. ఓo.......... దేవతాయై నమ:
   సర్వోపచారాన్ సమర్పయామి.
3. ఓo.......... దేవతాయై నమ:
   కర్పూర నీరాజనo సమర్పయామి
4. ఓo.......... దేవతాయై నమ:
   మoత్రపుష్పo సమర్పయామి
5. ఓo.......... దేవతాయై నమ:
   నమస్కారo సమర్పయామి

అనయా, యధాశక్తి, మయాకృత ధ్యానా వాహనాది
షోడశోపచార పూజయాచ  -
శ్రీ ....... దేవతా సుప్రసన్న, సుప్రీతా
వరదో భవతు -
ఓo ...... దేవతాయై నమ:

కాయేనవాచామనసేoద్రియై
ర్వాబుద్ధ్యాత్మనావా
ప్రకృతే: స్వభావాత్
కరోమియద్యత్  సకలoపరస్యై  నారాయణ యేతి

ఏతత్ఫలo శ్రీ ...... దేవతార్పణమస్తు

"హరి: ఓo తత్సత్"

  


    
           



No comments:

Post a Comment